సజావుగా ధాన్యం కొనుగోలుకు చర్యలు
సుభాష్‌నగర్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా అన్నిరకాల చర్యలు చేపట్టామని, కేంద్రాల్లో సమస్యలు రాకుండా చూడాలని సివిల్ సప్లయీస్ డీఎం అంబదాస్ రాజేశ్వర్ సూచించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్, గిరిరాజ్ కళాశాల మైదా నంలో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్డు, సన్నరకాల వివరాలను వేర్వేరుగా ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. గన్నీ, ట్రాన్స్‌పోర్ట్, రైస్‌మిల్లుల్లో, ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం నగరశివారులోని గన్నీ సంచుల గోదాము, ఎంఎల్‌ఎస్ పాయింట్, ఎఫ్‌ఆర్‌కే గోదామును పరిశీలించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో పీడీ ఎస్ బియ్యం పంపిణీతోపాటు ఇతర వివరాల రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీఎం కార్యాలయ అకౌంటెంట్ శ్రీధర్, గోదాము నిర్వాహకులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ నాగారం: వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాజశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం కింద 13 మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి 9వ తేదీలో గా దరఖాస్తులను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలని, మరిన్ని వివరాలకు nizamabad. telangana. gov.inను సంప్రదించాలని సూచించారు.
గాంధీభవన్ సదస్సులో జిల్లా నాయకులు
నిజామాబాద్ సిటీ: ‘కుల గణన – సకల జ నులకు ఆదరణ’ అనే అంశంపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంగళవారం ని ర్వహించిన సదస్సులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ల చైర్మన్‌లు పాల్గొ న్నారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హా జరయ్యారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాఽ ది, రాజకీయ, కుటుంబ సర్వేపై చర్చించా రు. బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యేలు సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతిరె డ్డి, కార్పొరేషన్‌ల చైర్మన్‌లు ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
వరుస విజయాలతో నిజామాబాద్ జట్టు
నిజామాబాద్‌నాగారం: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో నిర్వహిస్తున్న అండర్–23 రాష్ట్ర స్థాయి టోర్నీలో నిజామాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం నిర్వహించిన మ్యా చ్‌లో మెదక్ జట్టు టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 234 పరుగులు చేయగా, నిజామాబాద్ జిల్లా జట్టు 40 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. హర్షవర్ధన్‌సింగ్ 114 పరుగులుచేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జట్టు కోచ్‌గా సురేశ్‌బాబు, ఫీల్డింగ్ కోచ్‌గా లలిత్‌రెడ్డి, మేనేజర్‌గా నయూమ్ వ్యవహరించా రు. బుధవారం నల్గొండతో మ్యాచ్ జరగనుంది.
సరిహద్దులో
విస్త ృతంగా తనిఖీలు
మద్నూర్: రాష్ట్ర సరిహద్దులోని సలాబత్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం చెక్‌పోస్ట్ వద్ద అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఈ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించామని ఏవో రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment