సర్వేకు సర్వం సిద్ధం
నిజామాబాద్
బాల్‌బ్యాడ్మింటన్ జట్టుకు శిక్షణ
రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై న జిల్లా జట్టుకు మోర్తాడ్ బాలికల పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహించారు.
బుధవారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లో u
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మున్సిపాలిటీలు, డివిజన్ల వారీగా సర్వేను పూర్తి చేసేందుకు గత మూడు రోజుల నుంచి జిల్లాలో హౌస్ లిస్టింగ్ పూర్తిచేశారు. సర్వే చేపట్టాల్సిన ఇళ్లను బ్లాక్‌లుగా విభజించి అందుకు అనుగుణంగా సర్వే సిబ్బందిని కేటాయించారు. 1273 మంది ఆశ కార్యకర్తలు, 2182 మంది అంగన్‌వాడీ టీచర్లు, 537 మంది పంచాయతీరాజ్ సెక్రెటరీలు, 1873 మంది ఎస్జీటీ (టీచర్లు) సర్వేలో పాల్గొననున్నారు. నిజా మాబాద్ నగరంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, విద్యా శాఖ పరిధిలోని బోధనేతర, మెప్మా సిబ్బందికి కూడా విధులు కేటాయించారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సూపర్‌వైజర్లుగా నియమించారు. ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల విధులు నిర్వర్తించిన అనంతరం సర్వే ప్రారంభిస్తారు. ప్రాథమిక పాఠశాలలకు మధ్యాహ్నం తరువాత సెలవు ఇవ్వనున్నా రు. ఇంటింటికీ వెళ్లనున్న సర్వే సిబ్బంది ప్రతి కు టుంబానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సేకరిస్తారు.
న్యూస్‌రీల్
నేటి నుంచి సమగ్ర కుటుంబ
వివరాల సేకరణ ప్రారంభం
ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
370 మంది సూపర్ వైజర్లు,
3,343 మంది
ఎన్యుమరేటర్లు
75 అంశాలు.. 56 కాలాలు
సమగ్ర కుటుంబ సర్వేలో 75 అంశాలకు సంబంధించి వివరాలను 56 కాలమ్స్‌లో పొందుపర్చనున్నారు. వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలను నమోదు చేయనున్నారు. సేకరించిన పూర్తి వివరాలను నిర్దేశిత ప్రొఫార్మ ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment