టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ధర్పల్లి/సిరికొండ: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వేసే వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పర్యవేక్షణ అధికారి స్వామి రెడ్డి పాడి రైతులకు తెలిపారు. మండలంలోని దమన్నపేట్ గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమాన్ని స్వామిరెడ్డి, సహాయ సంచాకు లు బస్వరెడ్డి తనిఖీ చేసి, పశు వైద్య సిబ్బందికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు. స్వామిరెడ్డి మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే గాలికుంటి వ్యాధి పై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సహాయసంచాకులు కిరణ్ దేశ్ పాండే , మండల పశు వైద్యాధికారి అభిషేక్, ప్రజ్ఞ, వీఏ శివకుమార్, చంద్రశేఖర్, శ్రీనివాస్, సతీష్, రంజిత్, గోపాల మిత్రులు సర్దార్ , మహిపాల్ ఉన్నారు.
మోపాల్ మండలంలో..
మోపాల్: నగరశివారులోని బోర్గాం(పి)లో పశువులకు శుక్రవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను మండల పశువైద్యాధికారి బాబూరావు వేశారు. వీడీసీ ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, పశువైద్యులు శిరీష, సిబ్బంది రమేష్, పోచయ్య, గంగారాం, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment