సౌదీలో నర్సింగ్‌పల్లి వాసి మృతి
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ జమాల్ అలియాస్ అహ్మద్ మషూర్ (56) సౌదీ అరేబియాలో బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ జమాల్ కొంత కాలంగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు. అక్కడ మున్సిపాలిటీలో ఉద్యోగం చేసేవాడు. కొన్నిరోజులుగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తన తండ్రి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించాలని కుమారుడు జాఫర్ కోరారు.
అనారోగ్యంతో హోంగార్డు..
బోధన్‌టౌన్: బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న సాబేరా బేగం (55) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ వెంకటనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఆర్మూర్ టౌన్: మద్యం తాగి వాహనాలను నడపొద్దని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గురువారం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. బైక్‌పై వెళ్లే వారు హెల్మెట్ పెట్టుకోవాలని అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం ఆరు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment