నాగారంలో మహిళా శక్తి భవనం
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా స్థాయిలో మహిళా సంఘాలు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు కూడా మహిళా శక్తి భవనాన్ని మంజూరు చేసింది. దీని నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని నాగారంలో ఒక ఎకరం స్థలాన్ని కూగా కేటాయించారు. ప్రస్తుతం రూ.5 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం భవనాన్ని నిర్మించే బాధ్యత పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అధికారులు టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. జి ల్లాలో మొత్తం 28 మండల సామాఖ్యలు ఉన్నాయి. వీటిని కలుపుకొని జిల్లా సమాఖ్య ఏర్పాటైంది. ప్రతి నెలా మండల సమాఖ్య అధ్యక్షులతో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహిస్తుంది. మొన్నటి వరకు దూరంగా డిచ్‌పల్లిలో ఉన్న టీటీడీసీ భవనంలో నిర్వహిస్తూ వచ్చారు. మహిళా సంఘాలకు, నిరుద్యోగులకు ఉపాధి నైపుణ్య శిక్షణలు సైతం అక్కడే నిర్వహించేవారు. ప్రస్తుతం కలెక్టరేట్‌లో గ్రామీణా భివృద్ధి శాఖలో విశాలమైన స్థలం ఉండడంతో జిల్లా సమాఖ్య సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించి ఇవ్వనుండ డంతో సమావేశాలు, శిక్షణలకు ఇబ్బందులు తొలగనున్నాయి. నాగారంలోని ఎకరం స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించనుండగా ఇందులో మూడు ఆఫీసు గదులు, సమావేశపు గది, ట్రైనింగ్ రూం, విశ్రాంతి గదులు, క్యాంటీన్, పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ ‘సాక్షి’తో తెలిపారు.
నిర్మించబోయే ఇందిరా మహిళా శక్తి భవన నమూనా చిత్రం
రూ.5 కోట్లు మంజూరు చేసిన
రాష్ట్ర ప్రభుత్వం
పంచాయతీరాజ్ శాఖకు
నిర్మాణ బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment