గడుగును సన్మానించిన ఆదర్శ రైతులు
నిజామాబాద్ సిటీ : రాష్ట్ర వ్యవసాయ కమిష న్ సభ్యుడు గడుగు గంగాధర్‌ను ఆదర్శ రైతు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం జిల్లా కేంద్రంలోని గడుగు నివాసానికి పలు జిల్లాల నుంచి ఆదర్శ రైతు నాయకులు వచ్చారు. గడుగు గంగాధర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. గడుగు గంగాధర్ ఆదర్శ రైతులను స న్మానించారు. కరీంనగర్, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఆదర్శ రైతులు కె లింగన్న యాదవ్, వెంకటేశ్వర్‌రావు, రామిరెడ్డి, కోటేశ్వర్‌రావు, ప్రమోద్‌రెడ్డి కలిశారు. అనంతరం రైతుబజార్ ఎన్జీవోస్ కాలనీ యువజన సంఘం సభులు గడుగును సన్మానించారు.
ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా విడుదల
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విడుదల చేశారు. డి సెంబర్ 9లోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆర్డీవో, తహసీల్ కార్యాలయా ల్లో సంప్రదించాలన్నారు. డిసెంబర్ 30న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నా రు. ప్రస్తుతం ఓటర్ల ముసాయిదా ప్రకారం జిల్లాలో టీచర్లు 3199 మంది ఉన్నారు. ఇందులో పురుషులు1947, మహిళలు1252 మంది ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓటర్లు 27110 మంది ఉండగా ఇందులో 17237 మంది పు రుషులు, 9873 మంది మహిళలు ఉన్నారు.
మహిళా సంఘాల
సంఖ్యను పెంచాలి
● డీఆర్‌డీవో సాయాగౌడ్
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో మహిళా సంఘాలను పెంచాలని, కొత్త వారిని గుర్తించి గ్రూపుల్లో చేర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ అన్నారు. శనివా రం జిల్లా కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షులతో జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమాలపై చర్చించారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా ఎస్‌హెచ్‌జీలకు రు ణాలు అందించి లక్ష్యాలను పూర్తి చేయాలని సాయాగౌడ్ సూచించారు. రుణాలతో వ్యా పారాలు స్థాపించి ఆర్థికంగా స్థిరపడేలా మ హిళలను ప్రోత్సహించాలన్నారు. మండల, గ్రామ సంఘాల ఆడిట్ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇందులో సెర్ప్ అధికారి భారతి, డీపీఎంలు సంధ్యారాణి, సాయిలు, శ్రీనివాస్, మారుతి, సీ్త్రనిధి ఆర్‌ఎం రాందాస్, ఏపీఎం సరోజిని, జిల్లా సమాఖ్య అధ్యక్షులు రాధ, కార్యదర్శి లావణ్య, కోశాధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు వ్యాక్సిన్ సకాలంలో వేయాలి
జక్రాన్‌పల్లి: చిన్నపిల్లలకు వ్యాధులు సోక కుండా వ్యాక్సిన్లను సకాలంలో వేయాలని జి ల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి అశోక్ సిబ్బందికి సూచించారు. జక్రాన్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని చాంద్‌మియాబాగ్‌లో వ్యాక్సినేషన్ కార్యకమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. బుధ, శనివారాల్లో వ్యాక్సిన్లను వేయించాలన్నారు. సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, ఏఎన్‌ఎం సుమలత, ఆశావర్కర్లు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment