కనుల పండువగా డోలోత్సవం
● కొనసాగుతున్న కాలభైరవుడి
జన్మదినోత్సవాలు
● నేడు రథోత్సవం
రామారెడ్డి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇసన్నపల్లి(రామారెడ్డి)లోని శ్రీకాల భైరవ స్వామి ఆలయ కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 72 గంటలుగా నిర్వహిస్తున్న సంతత ధారాభిషేకం శనివారం ఉదయం ముగిసింది. మధ్యా హ్నం స్వామివారి బంగారు విగ్రహాన్ని బ్యాంకునుంచి ఆలయ ఈవో ప్రభుగుప్తా తీసుకువచ్చారు. అనంతరం బంగారు భైరవుడి విగ్రహాన్ని తొట్లెలో ఉంచి భక్తులు లాలి పాటలు పాడారు. ఈ సందర్భంగా భైరవ నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. డోలోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రథోత్సవానికి ఏర్పాట్లు..
ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో శోభాయాత్ర నిర్వహిస్తారు. రథం తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత దక్షయజ్ఞం ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment