ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టు సర్వే పరిశీలన
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి మండలంలోని మాదాపూర్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పైలట్ ప్రాజెక్టు సర్వేను జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న తీరును గమనించారు. స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా తదితర అంశాలను పర్యవేక్షించి ఆన్‌లైన్ నమోదు చేశారు. పక్కాగా వివరాలను సేకరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు నమోదు చేయాలని స్బిందికి సూచించారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం..
మాదాపూర్ గ్రామ పంచాయతీలోని పోలింగ్ బూత్ ను కలెక్టర్ సందర్శించారు. రెండో విడత ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని తనిఖీ చేశారు. ఎంత మంది కొత్త ఓటర్లను నమోదు చేశారని సిబ్బందిని అడిగారు. మరణించిన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారా ? తదితర వివరాలను బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, జక్రాన్‌పల్లి తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో సతీష్‌కుమార్ తదితరులున్నారు.
ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్
కేజీబీవీ, మోడల్ స్కూళ్ల తనిఖీ
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, మో డల్ స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తని ఖీ చేశా రు. డార్మెటరీ,స్టోర్ రూమ్, కిచెన్‌లో వంట సామగ్రి, స్టోర్ రూంలో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. ఉడకబెట్టిన కోడి గుడ్లను నీటి గిన్నెలో వేసి ఏవైన చెడిపోయినవి ఉన్నాయా అని పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment