అలుపెరగని శిక్షకుడు !
ఆయుధాలపై పోలీసు అకాడమీలో శిక్షణ ఇస్తూ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శిక్షణ ఇచ్చేందుకే పుట్టినట్లుగా తుది శ్వాస వరకు శిక్షణ ఇస్తూనే ఉంటానంటున్నారు ఈ రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ జిలకర కిషన్. నిజామాబాద్‌కు చెందిన ఈయన కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరినప్పటికీ తనకున్న ప్రతిభాపాటవాలతో కానిస్టేబుళ్ల నుంచి ఎస్‌ఐ, గ్రూప్–1, ఐపీఎస్ అధికారుల వరకు వివిధ రకాల వృత్తిపరమైన శిక్షణలు ఇస్తూ వచ్చారు. 1977లో ఉద్యోగంలో చేరిన కిషన్ 1984 నుంచి క్యాడర్ కోర్సులో పోలీసులకు అకాడమీలో శిక్షణ ఇస్తూ వచ్చారు. తన 38 ఏళ్ల సర్వీసులో 30 ఏళ్లు అకాడమీలో శిక్షణ ఇస్తూనే సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. శిక్షణ ఇస్తున్న క్రమంలోనే హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగోన్నతులు పొందారు. శిక్షణ ఇవ్వ డమే శ్వాసగా భావి స్తున్న కిషన్ వద్ద ప లువురు ఐపీఎస్‌లు అనేక అంశాలు నేర్చుకున్నారు. చాలామంది ఐపీఎస్‌లు, డీజీపీలుగా ఉన్నవారు సై తం కిషన్‌ను ఇప్పటికీ గౌరవపూర్వకంగా చూస్తుండడం విశేషం. పోలీసు శిక్షణ ఇవ్వడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టాప్ ఇన్‌స్ట్రక్టర్‌గా నిలిచారు. రిటైరయ్యాక సైతం కిషన్ అలుపెరగకుండా గత పదేళ్లుగా యోగా శిక్షణ ఇస్తూ వస్తున్నారు.
ఆయుధాలు వాడడంలో..
హిందీ, ఇంగ్లిష్ భాషలలో దిట్ట అయిన కిషన్ 1984 నుంచి 2015 వరకు పోలీసులకు క్యాడర్ శిక్షణ ఇ చ్చారు. ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్‌లో, చైన్నెలోని సీఆర్‌పీఎఫ్ విభాగంలో ఎక్స్‌ప్లోజివ్స్ కోర్సు, టేకన్‌పూర్(మధ్యప్రదేశ్)లోని బోర్డర్ సెక్యూరిటీ విభా గంలోని టియర్ స్మోక్ యూనిట్‌లో కోర్సు నేర్చుకున్న కిషన్ తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన గ్రేహౌండ్స్ శిక్షణలో రాటుదేలారు. అలాగే ముంబైలో జీబ్యాక్ శిక్షణ తీసుకున్నారు. 1980లో అసోం, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఏడాది పాటు పనిచేశారు. 2011లో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో అడ్మిన్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్నికల విధులు నిర్వహించారు.
అన్ని విభాగాల్లో పట్టు సాధిస్తూ వచ్చిన కిషన్ హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో 30 ఏళ్ల కాలంలో పలు కానిస్టేబుల్, ఎస్‌ఐ బ్యాచ్‌లకు చెందిన 10 వేల మందికి శిక్షణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 110 మంది గ్రూప్–1(డీఎస్పీ)లకు, సుమారు 50 మంది తెలుగు రాష్ట్రాల క్యాడర్ ఐపీఎస్‌లకు పూర్తి శిక్షణ ఇచ్చారు. మరో 50 మంది బీహార్, త్రిపుర, లక్షద్వీప్‌లకు చెందిన డీఎస్పీలకు శిక్షణ ఇచ్చారు. బీహార్ డీఎస్పీలకు నక్సల్స్ ఆపరేషన్లపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అన్నిరకాల ఆయుధాల వాడకం, ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, యుద్ధతంత్ర కళ, ఎక్స్‌ప్లోజివ్స్(భారీ పేలుడు పదార్థాల డిస్పోజ్) తదితరాలపై శిక్షణ ఇచ్చారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌ల ద్వారా కన్వెన్షనల్ సైన్స్‌లో శిక్షణ పొందిన కిషన్‌కు ఈ అంశంలో హెలీకాప్టర్ ఎక్కి చూసేవారి కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉండడం విశేషం.
పోలీసు అకాడమీలో శిక్షణ ఇస్తూ..
రాసిన పుస్తకాలు.. గీసిన చిత్రాలు..
రిటైరయ్యాక సెకండ్ ఇన్నింగ్స్..
తన 38 ఏళ్ల సర్వీసులో 30 ఏళ్ల పాటు అకాడమీలో శిక్షణ ఇచ్చిన కిషన్ రిటైరయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ఉద్యోగంలో చేరకముందే తాను నేర్చుకున్న యోగా శిక్షణను 2000 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసు అకాడమీలో 1000 మందికి యోగా శిక్షణ ఇచ్చారు. రిటైరయ్యాక హరిద్వార్‌లోని పతంజలి సంస్థలో మరింతగా యోగా శిక్షణ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం నుంచి ఎల్–1, ఎల్–2, ఎల్–3 కోర్సులు పూర్తి చేసి ప్రస్తుతం నేరుగా ఎల్–6 యోగా కోర్సు ఆన్‌లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. నిజామాబాద్‌లో పోలీసు హెడ్‌క్వార్టర్స్‌తో పాటు వివిధ యోగా కేంద్రాల్లో ప్రతి ఉదయం యోగా నేర్పుతున్నారు. ఇక యోగా థెరపీ ద్వారా చాలామందికి క్యాన్సర్, షుగర్, బీపీ, కీళ్లనొప్పుల చికిత్స చేశారు. మరోవైపు విద్యార్థులకు ఇంపాక్ట్ ద్వారా ప్రతి ఏటా 20 ప్రభుత్వ పాఠశాలల్లో మెమరీ స్కిల్స్, పరీక్షల సన్నద్ధతపై శిక్షణ ఇస్తున్నారు.
38 ఏళ్ల సర్వీసులో 30 ఏళ్ల పాటు.. ఎస్‌ఐ, డీఎస్పీ, ఐపీఎస్‌లకు వివిధ అంశాల్లో శిక్షణ
ఆయుధాలు, ఎక్స్‌ప్లోజివ్స్, యుద్ధతంత్ర, మ్యాప్ రీడింగ్ తదితరాల్లో తర్ఫీదు శిక్షణ అంశాలపై పలు రచనలు
ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన ఘనత రిటైర్మెంట్ తర్వాత గత పదేళ్లుగా యోగా శిక్షకుడిగా..
ఇంపాక్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెమరీ స్కిల్స్, పరీక్షల సన్నద్ధతపై మార్గదర్శనం
నిత్య విద్యార్థిగా ఆయుష్ ద్వారా యోగాలో ఉన్నత కోర్సుల అభ్యసన
కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి సీఐగా పదవీ విరమణ చేసిన కిషన్ సేవలు అజరామరం
తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో ముత్యాల్లాంటి అక్షరాలు రాసే కిషన్ చేతితో చిత్రాలు గీయడంలోనూ దిట్ట. ఈ క్రమంలో కిషన్ పోలీసు శిక్షణ కోసం అవసరమైన పుస్తకాలు రాశారు. కొన్ని తెలుగులోకి తర్జుమా చేశారు. అన్నింటికీ సంబంధించి పెన్నుతోనే అనేక చిత్రాలు గీశారు. ఆయుధాల విడిభాగాలను చేతితోనే అద్భుతంగా చిత్రించారు. పోలీసులకు అకాడమీలో యోగా తరగతులు నిర్వహించారు. కిషన్ రాసిన యోగా పుస్తకాలు, ఆయుధాల వాడకం, అన్నిరకాల డ్రిల్స్, ఆయుధాలు, ఫైరింగ్ విషయమై హ్యాండ్ బుక్ రాశారు. అవుట్‌డోర్ హ్యాండ్ బుక్ ఆఫ్ ట్రైనర్స్, పోలీసు స్టేషన్ల రక్షణ అంశాలపై రాసిన పుస్తకాలు అకాడమీ లైబ్రరీలో ఉంచారు. ఇక ఆయుధాల నిర్వహణ(ఆంగ్లం నుంచి తెలుగుకు తర్జుమా) చేశారు.
Comments
Please login to add a commentAdd a comment