బల్దియాను ఆదర్శంగా నిలుపుతాం | - | Sakshi
Sakshi News home page

బల్దియాను ఆదర్శంగా నిలుపుతాం

Published Fri, Nov 29 2024 1:34 AM | Last Updated on Fri, Nov 29 2024 1:33 AM

బల్ది

బల్దియాను ఆదర్శంగా నిలుపుతాం

భవన నిర్మాణ

అనుమతుల్లో అవినీతి..

టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో 26 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అధికారులు లేరు. ఉన్నవారితోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడం పెద్ద సమస్య. గతంలో సంగతి తెలియదు. నిబంధనలను పాటిస్తేనే అనుమతులు ఇస్తున్నాం.

ప్రతి ఉద్యోగి జవాబుదారీగా ఉండాలి

శానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌పై దృష్టి సారించాం

క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడం

పెద్ద సమస్య

మున్సిపల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల అద్దెను సవరిస్తాం

నగరాన్ని ట్రాఫిక్‌ ఫ్రీ జోన్‌గా మారుస్తాం

‘సాక్షి’తో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌

సాక్షి : కార్పొరేషన్‌ పరిధిలో మీరు గుర్తించిన సమస్యలేమిటి?

మున్సిపల్‌ కమిషనర్‌ : బాధ్యతలు తీసుకున్న తర్వా త అన్ని విభాగాధిపతులతో రివ్యూ నిర్వహించా. శా నిటేషన్‌, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో చాలా సమస్యలున్నాయి. వాటిపైనే దృష్టి సారించాను. తక్కువ మంది సిబ్బందితో సమర్థవంతమైన పాలన సా ధ్యం కాదు. ఉన్నతాధికారులకు వివరించా.

మొండి బకాయిల వసూళ్లు..

● కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటివరకు పన్ను చెల్లించని సుమారు 3వేల మందిని గుర్తించాం. డిమాండ్‌ నోటీసులు పంపాం. స్పందించకుంటే చర్యలుంటాయి.

శానిటేషన్‌ విభాగం సమస్యలు..

● పారిశుధ్య విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, కాంట్రాక్ట్‌ సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. రెగ్యులర్‌ ఉద్యోగులు తక్కువగా ఉన్నారు. హాజరు ఇచ్చి బయటకు వెళ్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. హాజరునమోదులో పక్షపాతం కనిపించింది. రెగ్యులర్‌గా ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు ఆకస్మి తనిఖీలు చేస్తున్నా.

పూర్తిస్థాయి ఎంహెచ్‌వో నియామకం..

● ప్రసుత్తం డిప్యూటీ కమిషనర్‌ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ఎంహెచ్‌వో వస్తారు. అప్పుడే హోటళ్లలో తనిఖీలు, కల్తీ ఆహార పదార్థాల గుర్తింపు, శానిటేషన్‌ వంద శాతం సాధ్యమవుతుంది.

అవుట్‌సోర్సింగ్‌ కార్మికులవేతనాల్లో అక్రమాలు..

● అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు వేతనాల చెల్లింపు హాజరు ఆధారంగా ఉంటుంది. బయోమెట్రిక్‌ హాజరు ఏర్పాటు చేయడం ద్వారా అవకతకవలు నివారిస్తాం. అనవసర ఉద్యోగులను తొలగిస్తాం.

మున్సిపల్‌ వాహనాల మరమ్మతులు..

● వాహనాల మరమ్మతుల కోసం ప్రత్యేకంగా గ్యారేజ్‌ఏర్పాటు చేస్తాం. మెకానికల్‌ ఇంజినీర్‌ను, మెకానిక్‌లను నియమిస్తాం. వాహనాలు ఇక్కడే రిపేర్‌ చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం.

మున్సిపల్‌ కాంప్లెక్సుల్లో అద్దె సవరణ..

● మున్సిపల్‌ పరిధిలోని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ గదుల అద్దెను సవరిస్తాం. యజమానులు కూడా సబ్‌ లీజ్‌కు ఇవ్వడం కుదరదు. వాటిపై కూడా త్వరలోనే దృష్టిసారిస్తాం. దీర్ఘకాలంగా ఉన్నవారిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

సమీకృత మార్కెట్‌లు..

బోధన్‌ బస్టాండ్‌ సమీపంలో అహ్మద్‌పురా కాలనీలోని మీట్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తయినప్పటికీ కోర్టులో కేసు ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం. పాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని సమీకృతమార్కెట్‌ పూర్తికావడానికి నిదులు పూర్తిగా లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. నిదులు మంజూరుకాగానే మార్కెట్‌ పూర్తి అవుతుంది.

రాష్ట్రంలోనే మూడో అతిపెద్దదైన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యం, టౌన్‌ ప్లానింగ్‌ కంట్రోల్‌ తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో దిలీప్‌కుమార్‌ కమిషనర్‌గా వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్ని విభాగాలపై దృష్టి సారించిన దిలీప్‌.. ప్రతి ఉద్యోగి జవాబుదారీ గా ఉండాలని, అభివృద్ధి ఒక్కరోజులో జరగ దని, క్రమక్రమంగా చేపడుతామంటున్నా రు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతామంటున్న నూతన కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..

పార్కు స్థలాల ఆక్రమణలు..

పార్కు, 10శాతం స్థలాలు కొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. గుర్తింపు కోసం ప్రైవేట్‌ ఏజెన్సీకి బాధ్యతలు అప్పజెప్పనున్నాం. గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచె ఏర్పాటు చేసి పరిరక్షిస్తాం.

ఆక్రమణల తొలగింపు..

ఆక్రమణలపై ప్రతిరోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగిస్తాం. నిజామాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ జోన్‌గా మారుస్తాం.

– నిజామాబాద్‌ సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
బల్దియాను ఆదర్శంగా నిలుపుతాం1
1/1

బల్దియాను ఆదర్శంగా నిలుపుతాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement