సామూహిక అత్యాచారం వల్లే మహిళ మృతి
ఖలీల్‌వాడి/రెంజల్(బోధన్): నిజామాబాద్ నగరంలోని వ్యభిచార గృహంలో మహిళ సామూహిక అత్యాచారం వల్లే తీవ్రగాయాల పాలై మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. గురువారం సాక్షిలో ‘అత్యాచారం.. మహిళ మృతి’ శీర్షికన ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. ఎస్బీ, ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి.
రెంజల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు 40 ఏళ్ల మహిళకు వదిన వరుస అయ్యే ఆడపడుచు నగరంలోని ఓ ప్రాంతంలో ఆద్దెకు ఉంటూ కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విటులు రాగానే తన మరదలిని గ్రామం నుంచి గత శుక్రవారం నగరానికి పిలిపించినట్లు తెలిసింది. మహిళపై విటులు సామూహిక అత్యాచారం జరిపారని, ఈ సందర్భంగా వ్యభిచార గృహ నిర్వాహకురాలిని సైతం బెదిరించినట్లు సమాచారం.. తీవ్ర అస్వస్థతకు గురైన బాధిత మహిళ మృతి చెందడంతో శనివారం గ్రామానికి మృతదేహాన్ని తరలించి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించాలని చెప్పినప్పటికీ దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్బీ, ఇంటిలిజెన్స్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కాగా మహిళ మృతికి సంబంధించి వ్యభిచార గృహ నిర్వాహకురాలు నోరు విప్పితేనే ఆసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి అస్తికలను తీసుకుని ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయి. మహిళ పై సామూహిక అత్యాచారం జరిగిందా ? లేక చెప్పినట్లు వినకపోతే విటులు జరిపిన దాడిలో మరణించిందా ? కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరా లను ఎస్బీ, ఇంటిలిజెన్స్ ఆధికారులు మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. మూడో టౌన్ ఎస్సై హరిబాబును సంప్రదించగా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
ప్రాథమిక విచారణలో గుర్తించిన
పోలీసు వర్గాలు
నిజామాబాద్ నగరంలోని
వ్యభిచారం గృహంలో ఘటన
లోతుగా వివరాలు సేకరిస్తున్న ఎస్బీ,
ఇంటెలిజెన్స్ బృందాలు
Comments
Please login to add a commentAdd a comment