నిజామాబాద్
రెండో రోజూ నిరసనల జోరు
వాతావరణం
ఉదయం మంచు దట్టంగా కురుస్తుంది. చల్లని గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
కాలేజీల బంద్!
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోతే కాలేజీలను నిర్వహించలేమని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యప్రతినిధులు తెలిపారు.
గురువారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లో u
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు రెండో రోజు బుధవారం నిరసనలు, నిలదీతల మధ్యే కొనసాగాయి. అధికారులు ప్రకటించిన సంక్షేమ పథకాల ముసాయిదా జాబితాలో తమ పేర్లు లేవంటూ దరఖాస్తు దారులు గగ్గోలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 199 సభలు జరిగాయి. ఇందులో 159 గ్రామపంచాయతీలు, 40 వార్డులు ఉన్నాయి. మోర్తాడ్ మండలం వడ్యాట్‌లో సభ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో అధికారులు అర్ధతరంగానే సభను ముగించారు. నిజామాబాద్‌లోని 41 డివిజన్‌లో జరిగిన వార్డు సభలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాలో మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి పేరు నమోదు కావడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ కార్పొరేటర్ అధికారులను నిలదీశారు. బోధన్ డివిజన్ పరిధిలోని గ్రామసభలలో నిరసనలు ప్రతిధ్వనించాయి. రుద్రూరు మండలం సులేమాన్ ఫారంలో అధికారులను ప్రజలు నిలదీశారు. అర్హుల జాబితాను అడ్డుకున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల జాబితాలో తమ పేర్లు నమోదు చేయాలని వాగ్వాదానికి దిగారు. ఏసీపీ శ్రీనివాస్ గ్రామ సభకు వచ్చి ప్రజలను సముదాయించారు. సుంకిని, చిక్కడపల్లి గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీశారు.
● అధికారులను నిలదీసిన ప్రజలు ● సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు లేవంటూ గగ్గోలు
● వడ్యాట్‌లో అర్ధంతరంగా ముగిసిన సభ ● జిల్లా వ్యాప్తంగా 199 వార్డు, గ్రామ సభలు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment