వెయ్యికోట్లు దాటిన రుణాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లాలో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో అధికారులు లక్ష్యం దిశగా సాగుతున్నారు. మరో రెండు నెలలు గడువు ఉండగానే మహిళా సంఘాలకు 86 శాతానికి పైగా రుణాలు అందించారు. జిల్లాలో ఎనిమిది మండలా లు లక్ష్యానికి మించి మహిళా సంఘాలకు రుణాలు అందించగా, ముప్కాల్ మండలం మొదటి స్థానంలో ఉంది. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపే తం అయ్యేందుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1228.71 కోట్లకు పైగా రుణాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ విధించింది. కొండంత లక్ష్యన్ని చేధించడం కష్ట సాధ్యమని సెర్ప్ ఉద్యోగులు తొలుత భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విడతల వారీగా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ వచ్చారు. ఈ ఏడాది మార్చి నాటికి ఆయా మండలాలకు కేటాయించిన టార్గెట్‌ను పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటికే పలు మండలాలు నూటి శాతా నికి మించి రుణాలు అందించి ముందు వరుసలో ఉన్నాయి. మిగతా మండలాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. రూ.వెయ్యి కోట్ల మార్క్‌ను దాటి రుణా లు అందించిన గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాను తెలంగాణలో మూడో స్థానంకు తీసుకెళ్లింది.
లక్ష్యానికి మించి రుణాలిస్తాం
సెర్ప్ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని ఏ మాత్రం భారంగా భావించకుండా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రు ణాలు అందిస్తున్నాం. ఇప్పటికే 86 శాతానికి మించి రు ణాలు ఇచ్చాం. మార్చి నాటికి లక్ష్యానికి మించి రుణాలు అందజేసి రాష్ట్ర స్థాయిలో మంచి స్థానాన్ని పొందుతాం. వెనుకబడిన మండలాలు తమ టార్గెట్‌ను పూర్తి చేయాల్సిందే.
– సాయాగౌడ్, డీఆర్‌డీవో
మొత్తం రూ.1228.71కోట్ల రుణాలు 20,350 మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యం ఉంది. ఇప్పటి వరకు 1058.31 (86.13 శాతం) రుణాలను 12,564 సంఘాలకు అందించారు. అయితే సంఘాలకు రుణాలు అవసరం లేకున్నా బలవంతంగా అంటగట్టారనే ఆరోపణలు ఉన్నా యి. బ్యాంకులో పాత రుణాలు తీరకముందే కొత్త రుణాలు అందించడంతో పేద మహిళలకు వాయిదాలు చెల్లించడం కష్టంగా మారింది. ము ప్కాల్ మండలం లక్ష్యానికి మించి రూ.23.72కోట్లకు పైగా (122.32శాతం) రుణాలు అందించి టాప్‌లో ఉండగా ధర్పల్లి 48.82 శాతం రుణాలు అందించి చివరిస్థానంలో ఉంది. మార్చి నాటికి నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆదేశాలున్నాయి. అధికారుల ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
86 శాతం పంపిణీ..
బ్యాంకు లింకేజీ రుణాల్లో
మూడో స్థానంలో నిలిచిన జిల్లా
మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ.1058.31 కోట్లు పంపిణీ
ఎనిమిది మండలాల్లో పూర్తయిన టార్గెట్
Comments
Please login to add a commentAdd a comment