విదేశాలలో ఉద్యోగ అవకాశం
నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని నిరుద్యోగులకు విదేశాలలో (ఫిజీ ఐలాండ్) ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి బిపి మధుసూదన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టమ్‌కామ్) అనేది తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టరైన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ. ఈ ఎజెన్సీ ఫిజీ ఐలాండ్‌లో నిర్మాణ, ఐటీ ఫీల్డ్, అకౌంట్స్ విభాగాలలో ఖాళీలు భర్తీ చేయనుంది. కనీస సంబంధిత విద్యార్హత కలిగిన అభ్యర్థులు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో నిర్ణీత తేదీన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌కు హాజరై రెజ్యూమ్‌లను tomcom.resume@gmail. com కు పంపాలి, అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 94400 49861 / 94400 51452 / 98496 39539 సంప్రదించాలని ఉపాధి కల్పనా అధికారి కోరారు.
ఎన్నికల లబ్ధి కోసమే గ్రామసభలు
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వేల్పూర్‌లోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీ లు, 420 హామీలు వందరోజుల్లో ఇస్తామని ఒట్టేయించుకొని గద్దెనెక్కారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్లకే రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అని నాగర్‌కర్నూల్ ఎమ్మె ల్యే, మాజీ ఎమ్మెల్యే సంపత్ డైరెక్టుగా చె బుతున్నారని, ఇలాంటప్పుటు గ్రామసభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్‌చార్జి సునీల్‌కుమార్ పదే ళ్లుగా నామీద విమర్శలు చేస్తూనే ఉన్నా డన్నారు. దానికి బదులు నియోజకవర్గంలో 31 వేల మంది రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయించాలని, కోడళ్లకు రూ. 2500, అత్తకు రూ. 4 వేలు ఇప్పించాలన్నా రు. సమావేశంలో నాయకులు బద్దం ప్రవీణ్‌రెడ్డి, నాగధర్‌రెడ్డి, దేవేందర్, దొన్కంటి నర్సయ్య, చౌట్‌పల్లి రవి, ఆర్మూర్ మహేశ్, సామ మహిపాల్, దొల్ల రాజేశ్వర్, నాయకులు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకం కావాలి
● సునీల్‌రెడ్డి
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ సభలలో ప్ర భుత్వాన్ని నిలదీయాలని ప్రజలను రెచ్చగొట్టుడు సరికాదని, దమ్ముంటే ప్రజలతో మ మేకమై వారి సమస్యల పరిష్కారంలో చొర వ చూపాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి సవాల్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మోర్తాడ్‌లో బుధవారం విలేకరుల సమావే శంలో మాట్లాడారు. మూడోసారి ఎమ్మెల్యే గా గెలిచినా ప్రశాంత్‌రెడ్డికి ప్రజల సమస్యలపై ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు నీతుల వల్లిస్తున్నారని ఎద్దెవా చేశారు. ప్రశాంత్‌రెడ్డికి ఎంత మా త్రం దమ్ము, ధైర్యం ఉన్నా ప్రజలతో కలిసి గ్రామ సభలలో పాల్గొనాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, ముత్యాల రాములు, సుంకెట్ రవి, సోమ దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) శివారులో ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ఒకేషనల్ (ఈటీ, ఎంఎల్‌టీ) గ్రూపు లలో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎం రణవీర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 6, 7, 8వ తరగతులలో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి కేవలం మైనార్టీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవలన్నారు. మరిన్ని వివరాలకు 7995057949, 8301242253 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment