అర్హులందరికీ లబ్ధి
ఆర్మూర్, మోర్తాడ్ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. ఈ నెల 26 నుంచి ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భ రోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్, మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామాలలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయా పథకాల కింద అర్హులుగా గుర్తించబడిన వారి ముసాయిదా జాబితాను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. జాబితాలో పేర్లు లేని వారి నుంచి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్ర స్తుతం గ్రామ సభల్లో చదివి వినిపించిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని, ఇందులో అన ర్హులు ఉంటే వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. ఇంకనూ ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకే ప్రభు త్వం గ్రామ సభలు నిర్వహిస్తోందన్నారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల గ్రామ సభలలో ఎవరైనా దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారు ఈ నెల 24 తర్వాత మండల పరిషత్ కార్యాలయాలలో గల ప్రజాపాలన సేవ కేంద్రాలలో కూడా దరఖాస్తులు అందించవచ్చన్నారు. ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా వచ్చిన దర ఖాస్తు లను పరిశీలించి రూపొందించిన ముసాయిదా జా బితాను ప్రజల పరిశీలన కోసం గ్రామ పంచాయతీ బోర్డులపై అతికిస్తామన్నారు. జాబితాలో అనర్హులను గుర్తిస్తే ప్రజలు అధికారులకు లిఖితపూర్వకంగా, ఫోన్ ద్వారా, నేరుగా కూడా తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళనకు, అపోహలకు గురి కావలసిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు గ్రామాలలో అర్హులైన వారు ఆయా సంక్షేమ పథకాల కింద దరఖాస్తులు చేసుకునేలా విద్యావంతులు, యువకులు ,గ్రామ పెద్దలు చొరవ చూపాలన్నారు.
ప్రజాపాలన గ్రామ సభలను
సద్వినియోగం చేసుకోవాలి
ఆర్మూర్, మోర్తాడ్ మండలాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటన
Comments
Please login to add a commentAdd a comment