సైబర్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సుంకెట్ గ్రామసభలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు. సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎవరైనా కొత్త ఫోన్ నెంబర్ల నుంచి కాల్ చేస్తే, అలాంటి వారిని నమ్మకూడదని, సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఓటీపీ నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు తెలుపవద్దని జాగ్రత్తలు సూచించారు. గ్రామ సభలలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు, మోర్తాడ్ ఎంపీడీవో బ్రహ్మానందం, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి లక్పతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment