నందిపేట్(ఆర్మూర్): మండలంలోని లక్కంపల్లి శివారు ప్రాంతంలో ఉన్న సురేశ్‌నగర్ కాలనీ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. నందిపేట ఎస్సై చిరంజీవి, సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసు బృందం సభ్యులు పలు గృహాలపై ఆకస్మికంగా దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బాధితులుగా ఉన్న ఎనిమిది మంది మహిళలను రెస్క్యూ చేసి నిజామాబాద్‌లోని స్వధార్ హోమ్‌కు తరలించారు. అయితే ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నప్పటికీ వారి వివరాలను గోప్యంగా ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారిపై మాత్రమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించడం చర్చకు దారితీసింది. విటులు లేకుండా వ్యభిచారం జరుగుతుందని పోలీసులు ఎలా నిర్ధారణకు వచ్చారని, ఒకవేళ విటులను అదుపులోకి తీసుకుంటే పోలీసులు ఆ విరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
● ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు
● స్వధార్ హోంకు 8మంది
మహిళల తరలింపు
● విటుల వివరాలు గోప్యంగా
ఉంచడంపై అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment