గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందాడు. సదరు వ్యక్తి మామిడిపల్లిలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. మామిడిపల్లిలోని ఆర్మూర్ మోటార్స్ షాప్ వద్ద శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడని ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
బోధన్ రూరల్: బోధన్‌లోని రాకాసిపేట్ కాలనీకి చెందిన పంచల్ శివలింగ్ (31) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. శివలింగ్ కార్పెంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ నెల 22న ఘన్‌పూర్‌కు వెళ్లి వస్తుండగా బైక్‌పై నుంచి పడి గాయపడ్డాడు. నిజామాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందా డు. మృతుడి భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
గన్నారం గ్రామానికి చెందిన వివాహిత..
రుద్రూర్: కోటగిరి మండలం గన్నారం గ్రామానికి చెందిన గంగమణి (38) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్సై సందీప్ తెలిపారు. అనారోగ్యం, ఇంట్లో గొడవలతో ఆమె మనస్తాపం చెంది మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఖిల్లా స్కూల్‌లో
అగ్ని ప్రమాదం
ఖలీల్‌వాడి: నగరంలోని ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల గదిలోని స్టోర్ రూంలో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు.
అటవీ అధికారులను
బెదిరించిన వారిపై కేసు
ఎల్లారెడ్డి: అటవీ శాఖాధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మూడు నెలల క్రితం లింగంపేట మండలం ముంబాజీపేటకు చెందిన మంజా నార్చోడ్ అటవీ భూమిని చదును చేస్తుండటంతో జేసీబీని ఎల్లారెడ్డి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కోలా శ్రీనివాస్ నాయక్ పట్టుకున్నారు. ఈ కేసు హైకోర్టులో ఉంది. అయితే ఆదివారం మంజా నార్చోడ్, రాథోడ్, గంగమ్మ కలిసి కార్యాలయంలోకి చొరబడి తమ జేసీబీని సీజ్ చేసినందుకు శ్రీనివాస్ నాయక్‌ను తిట్టి, చంపుతామని బెదిరించారు. అలాగే అటవీ శాఖ ఉన్నతాధికారులను అడ్డగించారు. తనను చంపుతామని బెదిరించారని శ్రీనివాస్ నాయక్ ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment