బోధన్ పట్టణాభివృద్ధికి పాటుపడాలి
బోధన్: బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో 101 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆదివారం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఐక్యతతో బోధన్ పట్టణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. జాతీయ స్పూర్తి కలిగించేలా జెండాను ఏర్పాటు చేయడంపై అభినందించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మా శరత్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఏఎంసీ చైర్‌పర్సన్ అంకు సంధ్య దామోదర్, డీసీసీబీ మాజీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి, ఏకచక్ర సేవా సమితి ప్రతినిధులు అంకు మహేష్, శ్రీనివాస్‌రావు, తలాండే ఈశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment