ఇందిరమ్మ ఇళ్లపై రాజకీయాలు తగవు
వర్ని: పేదలకు మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లపై రాజకీయాలు తగవని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే నిధులు మంజూరు చేయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం సమంజసం కాదన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు నూతన పథకాల మంజూరు పత్రాలు ఆయన అందజేశారు. పక్కా గృహాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.3.75 లక్షలు చెల్లిస్తోందని పేర్కొన్నారు. అధిక వాట రాష్ట్ర ప్రభుత్వానిదే కాబట్టి ఏ పేరుతో అయినా పక్క గృహాలు మంజూరు ఇచ్చే హక్కు ఉందని పోచారం అన్నారు. కొత్తగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను మార్చి నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. బోధన్ ఆర్డీవో వికాస్ మహాతో, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వర్ని తహసీల్దార్ సాయిలు, ఎంపీడీవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment