కేంద్రమంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడాలి
మోపాల్: కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మోదీ బొమ్మ పెట్టాలని, ఇందిరమ్మ పేరు మార్చాలని, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదని వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రధాని మోదీ బొమ్మ పెట్టేది లేదని, నిధులు ఎలా ఇవ్వరో చూస్తామని ఆయన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్రంలో అమల్జేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ నాయకులు మతిస్థితిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ దొందుదొందేనని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్సీ కవిత అధికారం కోల్పోయిన తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీసీలకు 33శాతం రిజర్వేషన్లు అమల్జేస్తే బీఆర్‌ఎస్ 27శాతానికి తగ్గించిందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం అమల్జేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిందని గుర్తుచేశారు. నిజామాబాద్ మా ర్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలి గేట్ బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి
ప్రధాని మోదీ బొమ్మ పెట్టబోం
నిధులు ఎలా ఇవ్వరో చూస్తాం
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment