జవాన్ల ఊరు | - | Sakshi
Sakshi News home page

జవాన్ల ఊరు

Published Sun, Jan 26 2025 6:28 AM | Last Updated on Sun, Jan 26 2025 6:28 AM

జవాన్

జవాన్ల ఊరు

నిజామాబాద్‌

వాతావరణం

ఉదయం ఈదురు గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. రాత్రి మంచు కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.

మహిళామణులు..

జిల్లాలోని పలువురు మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.

ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025

– 8లో u

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పల్లెలు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటింటికీ ఇంటర్నెట్‌ సేవలు అందుతున్నాయి.అయితే డొంకేశ్వర్‌ మండలానికి చెందిన గంగగడ్డ (జీజీ) నడ్కుడ గ్రామం సోలార్‌ సిస్టం వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఊరికి అన్ని దిక్కులా ఎటు చూసినా సోలార్‌ పలకలే ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు భారీ విద్యుత్‌ చార్జీల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో జిల్లాలోనే జీజీ నడ్కుడ గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌గా పని చేసిన నారాయణ రెడ్డి ‘గ్రీన్‌ విలేజ్‌’ పేరుతో దీనికి శ్రీకారం చుట్టారు. జీజీ నడ్కుడలో మూడేళ్ల క్రితం సోలార్‌ను సిస్టిం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన బోరు మోటార్లు, విద్యుత్‌ దీపాలకు ‘సౌర’ విద్యుత్‌ను వాడుతున్నారు. సోలార్‌ సిస్టం ఏర్పాటు చేయకముందు పంచాయతీకి ప్రతి నెలా రూ.1లక్షకు పైగా విద్యుత్‌ బిల్లు వచ్చేది. ఇప్పుడు సగం మాత్రమే విద్యుత్‌ బిల్లు వస్తోందని పంచాయతీ కార్యదర్శి సుప్రియ, మాజీ సర్పంచ్‌ బద్దం మధులిక (రఘు)వెల్లడించారు. సోలార్‌ సిస్టంను సమర్థవంతగా వాడుతున్న జీజీ నడ్కుడ గ్రామ పంచాయతీ బాటలోనే జిల్లాలోని మరిన్ని గ్రామ పంచాయతీలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అడవి మామిడిపల్లికి మరోపేరు జైహింద్‌ పల్లి

సైన్యంలో గ్రామానికి చెందిన 17 మంది

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. ఆదివారం నిర్వహించనున్న 76వ గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రక్షణకు వీర సైనికులను అందించిన ‘అడవి మామిడి పల్లి’, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సోలార్‌ వెలుగులు విరజిమ్ముతున్న ‘గంగగడ్డ నడ్కుడ’ గ్రామాలపై ప్రత్యేక కథనాలు..

మాక్లూర్‌: సైన్యంలో చేరుతూ ఆ గ్రామంలో యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. మది నిండా దేశభక్తితో సైన్యంలో చేరుతున్నారు అడవి మామిడిపల్లి యువకులు. ఒక్కొక్కరుగా మిలట్రీలో చేరి గ్రామాన్ని జైహింద్‌పల్లిగా పిలిచే స్థాయికి తెచ్చారు. ఈ గ్రామం నుంచి మొట్టమొదటి మిలట్రీ మ్యాన్‌ చంద్రశేఖర్‌. ఆయనను స్పూర్తిగా తీసుకున్న గ్రామ యువత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 17 మంది సైన్యంలో చేరారు. మరో 10 మంది అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. జానకిరామ్‌, కాలేవార్‌ రాజు కమాండర్‌ స్థాయిలో దేశసేవ చేసి రిటైర్డు అయ్యారు. గంగోనే విక్రం, కల్లెడి సాయి, దేవేందర్‌, సంగెం అనిల్‌, లంబాని ప్రేమ్‌, రాజేష్‌, గంగోనే బాలాజీ, పాల్ధ నవీన్‌, కెతావత్‌ రవీందర్‌నాయక్‌ మరికొంత మంది ప్రస్తుతం సైన్యంలోనే ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని మరో 30 మంది యువకులు మిలట్రీలో చేరటమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు.

బోధన్‌: బోధన్‌ పట్టణంలో భారీ జాతీ య జెండా ఆవిష్కరించనున్నారు. 101 అడుగుల స్తంభం ఏర్పాటు చేశారు. ఏకచక్ర సేవా సమితి నేతృత్వంలో పట్టణంలో జాతీయ పతాకం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం వివిధ వర్గాల నుంచి విరాళాలు సేకరించారు. సుమారు రూ.10 లక్షల ఖర్చుతో అంబేడ్కర్‌ చౌరస్తాలో జెండా స్తంభం, ప్లాట్‌ఫాం నిర్మించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఈ భారీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. అందరి భాగస్వామ్యంతో జాతీయ జెండా నెలకొల్పినట్లు ఏకచక్ర సేవా సమితి అధ్యక్షుడు అంకు మహేశ్‌ తెలిపారు.

సైన్యంలో చేరడానికి ఎన్‌సీసీలో చేరాను

మా ఊరి నుంచి మిలట్రీలోకి వెళ్లిన వారి సంఖ్య 17 వరకు ఉంటుంది. వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను సైన్యంలో చేరాలని అనుకుంటున్నా. అందుకే ఎన్‌సీసీలో చేరి జూనియర్‌ అండర్‌ ఆఫీసర్‌ స్థాయిలో కొనసాగుతున్నా. – జ్ఞానదీప్‌,

బీటెక్‌, అడవి మామిడిపల్లి

బోధన్‌లో ఏర్పాటు చేయనున్న జెండా మ్యాప్‌

జీజీ నడ్కుడ జిల్లాకు ఆదర్శం..

సోలార్‌ సిస్టంలో ఆదర్శం

విద్యుత్‌ చార్జీల నుంచి విముక్తి

సమర్థవంతంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
జవాన్ల ఊరు1
1/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు2
2/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు3
3/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు4
4/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు5
5/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు6
6/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు7
7/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు8
8/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు9
9/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు10
10/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు11
11/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు12
12/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు13
13/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు14
14/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు15
15/16

జవాన్ల ఊరు

జవాన్ల ఊరు16
16/16

జవాన్ల ఊరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement