జాతీయ సమైక్యత శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
తెయూ(డిచ్‌పల్లి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‌లో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే జాతీయ సమైక్యత శిబిరానికి తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఆదివారం తరలివెళ్లినట్లు వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ కే రవీందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కంటింజెంట్ అధికారిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమ్‌గల్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి సుదర్శన్ వ్యవహరిస్తారన్నారు.
శిబిరానికి వలంటీర్లు ఎం శ్రీకాంత్, బి రాము (తెయూ), సీహెచ్ గంగాప్రసాద్ (జీడీసీ, భీమ్ గల్), పి.సంగీత (గిరి రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల), బి మానస (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ, కామా రె డ్డి), కే నిర్మల (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ, నిజామా బాద్) ఎంపిౖకైనట్లు కో ఆర్డినేటర్ తెలిపారు. శిబిరంలో కల్చరల్, లిటరరీ అంశాలపై పోటీలు, జాతీయ సమగ్రతపై అవగాహన కార్యక్రమాలు, వికసిత్ భారత్, మై భారత్, యోగా, సామాజిక కార్యక్రమాలు, డ్రగ్స్, మత్తుపదార్థాలను నిరోధించడం, అభివృద్ధి పథంలో విద్యార్థులు అనే అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని వివరించారు. జాతీయ సమైక్యత శిబిరానికి వెళ్తున్న ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను తెయూ వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment