మాతృభాషలో వెనుకబాటు!
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2,175 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, విద్యార్థులు లక్ష 68 వేల మంది ఉన్నారు. వీరికి సంబంధించిన విద్యాబోధన అంశాలను స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ ‘అసర్ నివేదిక–2024’లో వెల్లడించింది. 2020లో కరోనా మహమ్మారి పాఠశాల విద్యావ్యవస్థలో అభ్యాసన సంక్షోభాన్ని సృష్టించింది. రెండు విద్యాసంవత్సరాలను విద్యార్థులు కోల్పోవడంతో మాతృభాషలో సరిగా చదవలేకపోతున్నారు. ప్రాథమిక విద్యా వ్యవస్థలో తొలిమెట్టు కార్యక్రమం వలన కొంత ఫలితాలు మెరుగు పడినా ఆశించిన కనీసం అభ్యాసన సామర్థ్యాలను సాధించలేకపోయారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు గల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు మాతృభాషలో 1వ తరగతి పుస్తకాన్ని 77 శాతం మంది చదువులేకపోయారు. అదే ప్రాథమిక స్థాయిలో అక్షరాలను 42 శాతం మంది 1వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. కానీ 5,8 తరగతుల విద్యార్థులు పదాలను, వాక్యాలను చదువలేకపోతు న్నారు. ఉన్నత పాఠశాలల్లో తరగతికి ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు, పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నా సరైన పర్యవేక్షణ లేక గుణాత్మక విద్య పట్టుతప్పింది.
అంక గణితంలో..
మాతృభాషలో వెనుకబడిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు అంక గణితంలో గుణాత్మక ఫలితాలు సాధించారు. 3–5 తరగతులకు చెందిన విద్యార్థులు 57.7 శాతం మంది చిన్న తీసివేతలు చేయగలిగారు. భాగహారాలను 6–8 తరగతి విద్యార్థులు 36.2 శాతం మంది చేశారు.
తొలిమెట్టు విద్యా కార్యక్రమాలు గత విద్యా సంవత్సరంలో సక్రమంగా అమలు కావడం వల్ల పాఠశాల స్థాయి విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించగలిగారు.
2022 అసర్ నివేదిక ఫలితాల కన్నా 2024 అసర్ నివేదిక ఫలితాలు గణితంలో మెరుగయ్యాయి. అలాగే రాష్ట్ర సగటు కంటే మన ఉమ్మడి జిల్లా సగటు ఎక్కువగా ఉంది.
● కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ప్రవేశాలు పెరిగినా.. అనంతరం భారీగా తగ్గాయి. కాగా ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం, నూతన ఉపాధ్యాయుల నియామకం, పర్యవేక్షణకు ఎంఈవోలను నియమించడం వలన వచ్చే నూతన విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతాయని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసర్ నివేదికలో విద్యార్థుల సామర్థ్యం (శాతంలో)
తరగతి అక్షరాలను అక్షరాలు పదాలు 1వ తరగతి 2వ తరగతి
గుర్తించక పోవడం చదవడం చదవడం పాఠం చదవడం పాఠం చదవడం
1 30.8 42.2 21.9 4.2 0.9
2 13.2 37.9 36.0 10.4 2.5
3 7.8 26.5 41.3 18.3 6.2
4 4.0 16.6 34.0 28.8 16.2
5 2.6 11.6 26.9 27.4 31.6
6 3.8 9.6 18.3 27.7 40.6
7 2.3 10.5 15.7 27.4 44.1
8 1.6 7.7 11.7 22.7 56.4
ఉన్నత పాఠశాలల్లో పట్టు
తప్పిన గుణాత్మక విద్య
అంక గణితంలో మెరుగుపడిన
విద్యార్థుల ప్రమాణాలు
ఫలితమిచ్చిన తొలిమెట్టు కార్యక్రమాలు
విద్యావ్యవస్థలో కరోనా సంక్షోభం..
1వ తరగతి పుస్తకాన్ని చదువలేక పోయిన ఉన్నత పాఠశాల విద్యార్థులు
స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ వెల్లడించిన అసర్ నివేదిక–2024 వివరాలు
పాఠశాల విద్యలో మాతృ భాషా, గణిత సామర్థ్యాల సాధనలో ఉమ్మడి జిల్లా వెనుకబడింది. మాతృభాషలో 8వ తరగతి పిల్లవాడు 2వ తరగతి వాక్యాలను చదవలేకపోతున్నాడు. మాతృభాషలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు కొంత మెరుగుపడినా.. ఉన్నత పాఠశాలల పిల్లలు వెనుకబడ్డారు. గణితంలో కొంత మెరుగుపడిన 8వ తరగతి విద్యార్థులలో 60 శాతం మంది పిల్లలు భాగహారం చేయలేకపోతున్నారు. అరకొర వసతులు, తరగతికి ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు లేకున్నా ప్రాథమిక పాఠశాలలు కొంత సత్ఫలితాలు సాధించగా, ఉన్నత పాఠశాలలు గుణాత్మక విద్యాలో వెనుకబడ్డాయి. ఇటీవల స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ వెల్లడించిన అసర్ నివేదిక–2024లో విద్యార్థుల చదువులు నివ్వెరపరిచాయి.
పర్యవేక్షణ పెరగాలి
ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెరగాలి. దీంతో పాఠశాల విద్యాబోధన సక్రమంగా కొనసాగుతుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి టీచర్ల కొరత తీర్చాలి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు పర్యవేక్షణ ముఖ్యం. – సత్యానంద్,
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
సరైన ప్రణాళికను రూపొందించాలి
ప్రాథమిక విద్యావ్యవస్థలో వి ద్యార్థులకు అందిస్తున్న బోధ న సక్రమంగా ఉంది. అయితే దీనిని ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించాలి. విద్యాబోధన విద్యార్థులకు ఏమేరకు ఉపయోగపడుతుందో తెలుసుకొని మార్పులు, చేర్పులతో బోధన చేపట్టాలి. దీంతో ప్రతి విద్యార్థి మెరుగైన విద్యను అందుకుంటాడు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడతాయి.
– భూమయ్య, పీఆర్‌టీయూ
మండలాధ్యక్షుడు, నవీపేట
Comments
Please login to add a commentAdd a comment