కొత్త ఉద్యోగుల్లో అయోమయం
నిజామాబాద్ సిటీ: సర్కారు కొలువు దొరకగానే వారిలో గంపెడాశలు చిగురించాయి. గ్రూప్–4 ప రీక్ష పాసయ్యారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఎవరికి ఎక్కడ పనిచేయాలో సూచించారు. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌కు 44 మంది ఉద్యోగులను కేటాయించా రు. వారిలో 33 మంది బల్దియా కార్యాలయంలో రిపోర్టు చేశారు. మున్సిపల్ కమిషనర్ ది లీప్‌కుమార్‌ను కలిసి విధుల్లో చేరారు. తర్వాత మొదలైంది అసలైన సమస్య. తామేం చేయాలో వారికి తెలి య డం లేదు. విధుల్లోకి తీసుకున్నారు తప్ప విధి విధానాలు వివరించలేదు.
నెలరోజులైనా..
మున్సిపల్ కార్పొరేషన్‌లో జాయిన్ అయిన 33 మందిలో నలుగురిని వార్డు ఆఫీసర్లుగా తీసుకు న్నారు. మిగితా వారిని జూనియర్ అసిస్టెంట్ హోదాలో తీసుకున్నారు. వార్డు ఆఫీసర్‌లకు ప్రత్యేకమైన విధి విధానాలు, నియమ నిబంధనలున్నా యి. వీటిని ఉద్యోగులకు వివరించాల్సిన బాధ్యత అధికారులదే. కానీ బల్దియా అధికారులు కొత్త ఉ ద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించలే దు. శిక్షణ కూడా ఇవ్వలేదు.
అన్ని సెక్షన్‌లపై..
బల్దియాలో పనిచేసే ఉద్యోగులకు అన్ని సెక్షన్‌లపై అవగాహన అవసరం. కొత్తగా విధుల్లో చేరినవారు వార్డు ఆఫీసర్లుగా, జూనియర్ అసిస్టెంట్లుగా నియామకమయ్యారు. వీరికి రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఎ స్టాబ్లిష్‌మెంట్, ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ వంటి పలు విభాగాల పనితీరు, పనులు జరిగే విధానం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే ఏ విభాగంలోనైనా విధులు నిర్వహించాల్సి రావొచ్చు. వీరిలో చాలా మంది బీటెక్ చదివిన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వీరిలో చాలా మందికి సాధారణ పాలన పట్ల కనీస అవగాహన ఉండదు. కాగా కార్పొరేషన్‌లో కొత్తగా నియామకమైన ఉద్యోగుల కు కనీస అవగాహన కార్యక్రమం, శిక్షణ ఇవ్వలేదు. వీరు విధుల్లో చేరి 40 రోజులు దాటుతోంది. వీరిలో కొందరిని పారిశుధ్య విభాగంలో నియమించారు. మరికొందరిని పన్నుల వసూళ్లలో వేశారు. అయితే వీరు చేయాల్సిన విధులేంటో మాత్రం వీరికి తెలియడం లేదు. శిక్షణ ఇవ్వకుండా క్షేత్రస్థాయికి పంపడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్ప డింది. కచ్చితంగా డ్యూటీలు చేయలేకపోతున్నారు.
అయితే కొత్తగా వచ్చిన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో ఉన్నతాధికారులు దృష్టిసారించలేక పో తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వార్డుసభలు అంటూ సర్వేలు చేయడంతో అధికారులకు సమయం గడిచిపోయింది. ప్రస్తుతం పన్నుల వసూళ్లలో బిజీగా అయ్యారు.
అందువల్ల కొత్త ఉద్యోగులకు కచ్చితమైన డ్యూటీలు వేయడం, వారికి నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులు పురమాయించడం ఎప్పుడోనని పలువురు అంటున్నారు.
బల్దియాలో చేరిన 33 మంది..
40 రోజులు దాటినా నో ట్రైనింగ్
పనులపై కనీస అవగాహన కరువు
దృష్టిసారించని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment