పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నందిపేట్ (ఆర్మూర్): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 –89 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం నందిపేట పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి స్మృతులను నెమరువేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధలు నేర్పిన ఉపాధ్యాయులు అబ్దుల్ నబీ, రామ్మూర్తి, జనార్దన్, లక్ష్మీకాంతాచారి, పీఈటీ నరసింహారెడ్డి, శంకర్, సాయన్న, రామానుజను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment