నిజామాబాద్ నాగారాం: భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల అండర్–19 టీ–20 ప్రపంచకప్ 2025 టైటిల్ సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 82 పరుగులకే ఆలౌట్ అయింది. దేశప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు క్రీడాకారిణులు తమ సంతోషాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment