బంగారం, వెండి చోరీ
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని తొండాకూర్ గ్రామానికి చెందిన నామ్‌తాబాద్ భాను అనే మహిళ ఇంట్లో దుండగులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడి బంగారం, వెండితోపాటు నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. భానుతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటికి తాళం వేసి జీజీ నడ్కుడలో నిర్వహిస్తున్న అగ్గి మల్లన్న జాతరకు వెళ్లారు. రాత్రి అక్కడే జాగారం చేసి సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడడంతోపాటు బీరువా తెరిచి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. బీరువాలో ఉన్న సుమారు మూడు తులాల బంగారం, 25తులాల వెండి, రూ.30వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీమును రప్పించి ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment