కంకిపాడులో ఉద్రిక్తత
ఉత్సాహంగా కేక్ మిక్సింగ్
● వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు ● పరామర్శకు వెళ్లనీయకుండా అడ్డగించిన పోలీసులు
గుణదలలోని హోటల్ హయత్ ప్లేస్‌లో మంగళవారం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, వైన్, విస్క్, గ్రేప్ జ్యూస్‌తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్‌ను తయారు చేశారు. 40 రోజుల పాటు
నిల్వ ఉంచి క్రిస్మస్‌తో పాటు నూతన
సంవత్సర కేక్ తయారు చేసి అతిథులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు, యువత హుషారుగా
పాల్గొన్నారు.
– పవన్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ
కంకిపాడు: వైఎస్సార్ సీపీ నేతల అరెస్టుతో కంకిపాడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి సర్కారు ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించటం వివాదాస్పదం అయింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు ఒ.మోహనరంగా, ఎంపీపీ అనగాని రవి, బిహెచ్ యతీంద్ర రామకృష్ణ (రాము), మేచినేని బాబు, సూరపనేని అనిల్, గొన్నూరి సీమయ్య, గుర్రం నాని, కె.నిరంజన్‌కుమార్‌లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసి కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదనపు ఎస్పీ వివి నాయుడు, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సీఐలు, ఎస్‌ఐలు పోలీసుస్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా పోలీసులు వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు వ్యవహారంలో వ్యవహరించారు. పోలీసుస్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ మాదిరిగా బందోబస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసు అధికారులు స్టేషన్‌కు తలుపులు వేసి రోడ్డు మీద కాపలా కాయటం విడ్డూరం. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నేతలు స్టేషన్ రోడ్డులోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కమ్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామినేని రమాదేవి స్టేషన్‌లో ఉన్న తమ నేతలను కలుస్తానని, కాళ్లు పట్టుకుంటా ఒప్పుకోండి అంటూ బతిమాలారు. మాజీ ఎంపీపీ మాదు శ్రీహరిరాణి, అనగాని రవి తనయుడు సుందర్ చైతన్య, ఎంపీటీసీ చిట్టూరి ప్రసాద్, నేతలు శీలం రంగారావు, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment