గంజాయి రవాణా కట్టడికి చర్యలు
ఏలూరు రేంజ్ డీఐజీ ఆశోక్‌కుమార్
హనుమాన్‌జంక్షన్ రూరల్: గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి.అశోక్‌కుమార్ అన్నారు. హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ ఆర్.గంగాధరరావుతో కలిసి శనివారం ఆయన తనిఖీ చేశారు. కృష్ణా, ఏలూరు జిల్లాల సరిహద్దులో ఉన్న హనుమాన్‌జంక్షన్‌లో కొంతభాగం పొరుగుజిల్లాలోని పెదపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే సమాచారం తన దృష్టికి వచ్చిందని, నేరాలను నియంత్రించడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు అప్పనవీడులో పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు డీఐజీ తెలిపారు. హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ పరిధిలో క్రైం రేట్, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఆయన గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, సీఐ కేవీవీఎన్ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. హనుమాన్‌జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు ఎస్‌ఐలు వి.సురేష్, నరసింహమూర్తి, సీహెచ్ సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment