ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి
కృతికాశుక్లా
పెనమలూరు: విద్యార్థులు నైపుణ్యం, ప్రతిభా పాటవాలతో రాణించాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా అన్నారు. కానూరులో శనివారం స్కాట్‌స్పైస్ అంతర్జాతీయ పాఠశాలలో ది స్కాట్‌సైన్స్ ఐ4ఐఫోరమ్ 2024 అకడమిక్ ఫేర్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులు రూపొందించి ఆకట్టుకునేలా ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, అకడమిక్ డైరెక్టర్ వీరమాచినేని రఘు, అకడమిక్ హెడ్ రమ, సీఈవో కొడాలి జాహ్నవి, ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫిర్యాదుకు తావు లేకుండా ఓటర్ల జాబితా
చల్లపల్లి(అవనిగడ్డ): ఫిర్యాదులకు తావు లేకుండా ఫొటో ఓటర్ల జాబితాను తయారు చేయాలని కృష్ణా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బీఎల్‌వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చల్లపల్లి ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులపై దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం స్వచ్ఛసుందర చల్లపల్లి ఆధ్వర్యంలో నిర్మించిన పబ్లిక్ టాయ్‌లెట్స్‌ని జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. టాయ్‌లెట్స్ చాలా పరిశుభ్రంగా ఉన్నాయని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment