సమాజంపై బాధ్యతతో మెలగాలి
పటమట(విజయవాడతూర్పు): న్యాయమూర్తులు సమాజంపై బాధ్యతాయుతంగా మెలగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీఎన్ భట్టి అన్నారు. పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయంలో శనివారం ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేసిన అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ అంబటి లక్ష్మణరావు పేదలకు అండగా నిలిచేవారని, జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించేవారన్నారు. పదవీ విరమణ అనంతరం 28 ఏళ్లపాటు సామాజిక సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన హయాంలో శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా నష్టపోతున్న 40 గ్రామాల రైతులకు నాయ్యం చేశారని, ఆయన చేసిన పనులన్నీ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి సిటిజన్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి.భవానీప్రసాద్, రావి శారద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment