విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
u8లో
రైతులను నిండా ముంచిన కూటమి
వారి రూటే సపరేటు
హుండీ ఆదాయం రూ.23.92 లక్షలు
వేదాద్రి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసి ఉన్న యోగానంద లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ.23.92 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ సురేష్‌బాబు తెలిపారు.
ఉత్సాహ తరంగం
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న కృష్ణాతరంగ్–24 ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజు విద్యార్థుల కేరింతల నడుమ ఉల్లాసంగా జరిగింది.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన ఉమ్మడిశెట్టి లక్ష్మీవైష్ణవి కుటుంబం రూ.లక్ష విరాళం సమర్పించింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ వెస్ట్ బైపాస్ పనులకు హైటెన్షన్ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయి. గత ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా పనులు సాగాయి. ఈ ఏడాది జనవరిలోనే వెస్ట్ బైపాస్‌ను ప్రారం భించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బైపాస్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలో ఒకచోట, ఎన్టీఆర్ జిల్లాలో 12 చోట్ల ఏపీ ట్రాన్స్‌కో, ల్యాంకో, పవర్‌గ్రిడ్‌కు సంబంధించిన హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఆటంకంగా మారాయి. రోడ్డు పూర్తయితే అప్పటి వైఎస్సార్ సీపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే భావనతో కొంత మంది రైతులు కోర్టుకు వెళ్లి విద్యుత్ టవర్ల మార్పిడి జరగాల్సిన ప్రాంతంలో పనులు పూర్తి కాకుండా అడ్డుకున్నారు.
గతంలోనే 95 శాతానికి పైగా పనులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు తుది దశకు చేరాయి. అప్పట్లోనే దాదాపు 95 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. హైటెన్షన్ విద్యుత్ లైన్లు మార్చాల్సిన ప్రాంతం, గొల్లపూడిలో మూడు చోట్ల తప్ప మిగతా పనులు అన్ని పూర్తయ్యాయి. ప్యాకేజీ–3 కింద చినఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ పనులు సాగుతున్నాయి. ఈ పని విలువ రూ.1,148 కోట్లు. ఈ పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. ఈ రహ దారి కోసం 14 గ్రామాల్లో భూమి సేకరించారు. కృష్ణా జిల్లాలో వెదురుపావులూరు, రామచంద్రాపురం, కొండపావులూరు, బీబీ గూడెం, గన్నవరం, చిన్నఅవుటుపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గొల్లపల్లి, జక్కంపూడి, అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, కె.వి.కండ్రిక, నున్న గ్రామాల పరిధిలో మొత్తం 188.92 హెక్టార్ల భూమిని సేకరించారు. ఈ భూ సేకరణకు రూ.416.60 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో రోడ్డు పనులు శరవేగంగా సాగాయి. విజయవాడ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలనే కృత నిశ్చయంతో పనులను పరుగు పెట్టించారు.
అడ్డంకిగా మారిన విద్యుత్ లైన్లు
బైపాస్ రోడ్డుకు మధ్యలో హై ఓల్టేజీ విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకచోట, ఎన్టీఆర్ జిల్లాలో 12 చోట్ల ఏపీ ట్రాన్స్‌కో, ల్యాంకో, పవర్ గ్రిడ్‌కు సంబంధించిన హైటెన్షన్ విద్యుత్ లైన్లను మార్చాల్సి ఉంది. ఇవి గొల్లపూడి, అంబాపురం, నున్న ప్రాంతంలో ఉన్నాయి. వీటికి సంబంధించి పరిహార నిమిత్తం విజయవాడ సబ్ కలెక్టర్ భూమి కోల్పోయే రైతులతో చర్చించారు. ప్రభుత్వం సైతం రైతులకు మేలు కలిగే విధంగా ప్రత్యేక జీఓ ద్వారా పరిహారాన్ని సైతం మంజూరు చేసింది. సాధార ణంగా టవర్ బేస్ ప్రాంతంలో మార్కెట్ విలువ కంటే 100 శాతం అదనంగా పరిహారం ఇస్తారు. విద్యుత్ తీగలు వెళ్లే ప్రాంతంలో పది శాతం పరిహారం ఇస్తారు. అయితే ప్రభుత్వం ఈ పనులకు అడ్డంకికాకుండా ఉండేందుకు రైతులకు మేలు కలిగే విధంగా ప్రత్యేక జీఓ ద్వారా పరిహారం మంజూరు చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రభుత్వం టవర్ బేస్ ఏరియాలో మార్కెట్ విలువ కంటే అదనంగా 250 శాతం అంటే 2.5 రెట్లు, వైర్లు వెళ్లే ప్రాంతంలో మార్కెట్ విలువలో పది శాతం, పంట నష్టం జరిగి ఉంటే దానికి పరిహారం సైతం నేషనల్ హైవే అధికారులు జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేశారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ పేరుతో రూ.1.1కోట్లు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పేరుతో రూ.21.85 కోట్లు డిపాజిట్ చేశారు. ఈ విద్యుత్ లైన్లు బైపాస్ ప్రాంతంలో 1.49 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. అయితే విద్యుత్ లైన్లు వెళ్లే ఆరు ప్రాంతాల్లో రైతులు కోర్టుకు వెళ్లారు. మిగిలిన ప్రాంతాల్లో వైర్లను మార్పిడి చేసందుకు రెవెన్యూ అధికారులు సంబంధిత రైతులతో చర్చించారు. ఆ ప్రాంతాల్లో పనులను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేపట్టారు. కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చోట్ల పనులను ప్రారంభించారు.
బైపాస్‌కు అడ్డంకిగా ఉన్న విద్యుత్ టవర్లు
7
న్యూస్‌రీల్
ల్యాంకో లైన్లతో సమస్య
దాదాపు 95 శాతం మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తి
సమస్యగా మారిన ల్యాంకో సంస్థ టవర్ల మార్పిడి
తమ పొలాల్లో లైన్లు వేయొద్దని
అడ్డుకొంటున్న రైతులు
గత ఏడాది డిసెంబర్ నాటికే
పూర్తికావాల్సిన పనులు
ప్రస్తుతం 30 కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ రహదారికి సంబంధించి 28.740 కిలోమీటర్లు అంటే 96 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కేవలం 1.260 కిలోమీటర్ల మేర రోడ్డు పనులను మాత్రమే చేయాల్సింది. ప్యాకేజీ–3కు సంబం ధించి హైవేకు పూర్వం ఉన్న రోడ్లకు అనుసంధానం చేసే విధంగా 11.2 కిలో మీటర్ల స్లిప్ రోడ్లు వేశారు. అండర్ పాసులు, ప్రధాన వంతెనలు, బాక్సు కల్వర్టులు, పైపు కల్వర్టులు, చిన్న వంతెనలు, ట్రక్ బేలు, టోల్‌ప్లాజా ఇలా అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ల్యాంకోలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి నిలిచి, ఆ కర్మాగారం నడవటం లేదు. అలాంటి కర్మాగానికి విద్యుత్ టవర్లు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. ల్యాంకోకు సంబంధించి 16 హెచ్‌టీ టవర్లు బైపాస్‌కు అడ్డుగా ఉన్నాయి. ఏడు టవర్ల మార్పిడి విష యంలో జక్కంపూడి, అంబాపురం రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. మళ్లీ రైతులు కోర్టు మెట్లు ఎక్కడంతో వెస్ట్ బైపాస్ పనులకు అడ్డంకిగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment