వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ‘ఫీజు పోరు’ పోస్టర్‌ను దేవినేని అవినాష్ నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఫీజు పోరు నిర్వహిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 5న బీసెంట్ రోడ్డు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పిస్తామన్నారు.
మాట తప్పిన బాబు..
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాట ఇచ్చి తప్పారన్నారు. డబ్బులు లేవు.. పథకాలు అమలు చేయడం కుదరదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్ పేద విద్యార్థులకు అండగా నిలిచారన్నారు. నేడు అధికార కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.
● పార్టీ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు విద్యార్థిలోకానికి అన్యాయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఫీజు బకాయిలు చెల్లించే విధంగా విద్యార్థుల పక్షాన పోరాడుతామన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన జగన్ గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్వీర్యం చేసిందన్నారు.
● తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు విద్యార్థులపై కూటమి ప్రభుత్వం విషం కక్కుతోందన్నారు. జగన్ నాడు– నేడు లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు అండగా ఉన్నారన్నారు.
● మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు నిర్వహించి వారికి అండగా నిలబడతామన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు.
ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, మొండితోక అరుణ కుమార్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జగ్గయ్యపేట వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, సర్నాల తిరుపతిరావు, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, పోతిన వెంకట మహేష్, కాలే పుల్లారావు, దొడ్డా అంజిరెడ్డి, బందెల కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment