11 నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల
పెనుగంచిప్రోలు: గోపయ్య సమేత తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రూ.1.19 కోట్ల అంచనాతో ఏర్పాటుచేయనుంది.
11న కల్యాణోత్సవం
పెద్ద తిరునాళ్లలో భాగంగా ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ కల్యాణం అత్యంత వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి తరఫున కొల్లా వంశీయులు, స్వామివారి తరఫున కాకాని వంశీయులు పీటలపై కూర్చోనున్నారు. కల్యాణోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అదే రోజు ఉదయం 41 రోజుల పాటు మండల దీక్ష చేపట్టిన భక్తులు తిరుముడి సమ ర్పించి దీక్ష ముగిస్తారు.
జలబిందెల ఉత్సవం
తిరునాళ్లలో రెండో రోజు ఫిబ్రవరి 12న జలబిందెల మహోత్సవం నిర్వహిస్తారు. స్థానిక మునేరులో ఐదు వంశాలకు చెందిన వారు కుండల్లో నీటిని తీసుకొని, పూజా కార్యక్రమాల అనంతరం భక్త జనసందోహం మధ్య ఆలయానికి చేరుస్తారు. ఆ నీటిని అంకమ్మ ఆలయంలో మట్టి పాత్రల్లో ఉంచిన నవధాన్యాలపై చల్లుతారు.
అదే రోజు అమ్మవారి కల్యాణం రూ.1.19 కోట్ల అంచనాతో ఏర్పాట్లు
15న పూర్ణాహుతి
ఫిబ్రవరి 13 న ఉదయ పొంగళ్లు కార్యక్రమం పేరున ఆలయంలో అంకమ్మ అమ్మవారి విగ్రహం ముందు శాలివాహనులు పొంగళ్లు చేస్తారు. ఆరోజు జలబిందెలు ఎత్తుకున్న వారు పాల్గొంటారు. 14వ తేదీ దీవెన బండారు కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు జరుగుతాయి పెద్ద తిరునాళ్ల ఫిబ్రవరి 15న జరిగే పూర్ణాహుతితో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment