ఘనంగా ‘సుబ్రహ్మణ్యేశ్వరుడి’ బ్రహ్మోత్సవాలు
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్, ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత స్వామివారు, అమ్మవార్ల పట్టువస్త్రాలతో ప్రదక్షిణ చేశారు. వేదపండితుడు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఉదయం 7 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ పుణ్యహవచనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించారు.
తొలిసారిగా పుష్కరిణిలో తెప్పోత్సవం
దేవస్థానానికి చెందిన పుష్కరిణిలో తొలిసారిగా స్వామివార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈనెల 6వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నారు. ఉదయం ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు, వేదపండితులతో తెప్పోత్సవానికి పూజలు చేసి పుష్కరిణిలోకి వదిలారు. డ్రోన్ కెమెరాలతో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీసీ వరప్రసాదరావు తెలిపారు.
విద్యుత్ కాంతులతో ఆలయం
Comments
Please login to add a commentAdd a comment