కౌలు రైతుల పంటపై అధికార దౌర్జన్యం
కృత్తివెన్ను(పెడన): ఓ మంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్న కొందరు రెచ్చిపోయి ఊరుకాని ఊరుకు వచ్చి కౌలు రైతుల పంటను ఆదివారం అక్రమంగా కోత కోసేయడంతో గ్రామస్తులంతా ప్రతిఘటించారు. దీనిపై సత్యనారాయణ, చందు సత్యనారాయణ బాధితులకు ఫిర్యాదు చేశారు. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం చినగొల్ల పాలెంలో ఎండూరి రవీంద్రమూర్తికి చెందిన 213, 217, 572/1 సర్వే నంబర్లలోని 53.76 ఎకరాల భూమిని పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ 2011లో కౌలుకు తీసుకుని సరుగుడు సాగు చేపట్టారు. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. దీనిపై కొల్లు రంగనాథ్, గంపల కస్తూరి, నడకుదిటి అర్జున, పైడిపాటి త్రినాథ్, పొన్నగంటి చంద్రమౌళి, ఊకంటి రాంబాబు, కొల్లూరి సూర్యచంద్రభగవాన్‌గుప్తా స్థానికంగా ఉన్న కొందరితో కలసి జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సుమారు నాలుగు ఎకరాల్లోని రూ.60 లక్షల విలువైన పంటను అక్రమంగా కోసుకుపోయారు. ఆదివారం ఉదయం 150 మందితో రాజకీయ అండదండలతో తోటల్లోకి ప్రవేశించి సరుగుడు తోటను కొట్టివేయడం ప్రారంభించారు. వారిని కౌలు రైతులు, గ్రామస్తులు అడ్డుకుని ప్రశ్నించారు. దుండగులు దూషించారని గ్రామస్తులు తెలిపారు.ఘటనా స్థలానికి డీఎస్పీ రాజా, ఆర్డీఓ స్వాతి, సీఐ నాగేంద్రకుమార్, పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పంటను సాగు చేస్తున్న రైతులు కాకుండా ఓ మంత్రి అనుచరులు దౌర్జన్యంగా వచ్చి కోసుకుపోవడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారంతా తీవ్రస్థాయిలో మంత్రి కొల్లు రవీంద్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమ్మేసిన పొలంలో మళ్లీ అక్రమంగా..
ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్టు ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో తనది కాని ఈ పొలంలో 45 ఎకరాల భూమిని చినగొల్లపాలెం గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడికి ఎకరం రూ.7.50 లక్షలకు విక్రయించాడని సమాచారం. మొదటి విడతగా ప్రస్తుతం మంత్రి బినామీలకు ఆ నాయకుడు రూ.1.35 కోట్లు చెల్లించి స్వాధీన అగ్రిమెంటు సైతం చేసుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ నేత.. మంత్రి చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. అదే భూమిలో మంత్రి అనుచరులు అక్రమంగా ప్రవేశించి సరుగుడు తోటలను నరకడం చర్చనీయాంశంగా మారింది. మేము పండించే పంటపై వాళ్ల పెత్తనమేంటని కౌలు రైతు పెద్ది సత్యనారాయణ అన్నారు.
సరుగు తోటలను నరికేసినఓ మంత్రి అనుచరులు పెద్ద ఎత్తున గ్రామస్తుల తిరుగుబాటు కృత్తివెన్ను పీఎస్ వద్ద జరుగుతున్న పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment