చదరంగం విజేతలు ధ్రువీష్, శర్వాణి
విజయవాడస్పోర్ట్స్: కృష్ణా రీజియన్ (కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, ప్రకాశం) బాల, బాలికల చదరంగం పోటీల ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 6.5/7 పాయింట్లు సాధించి డి.ధ్రువీష్ విన్నర్ ట్రోఫీని అందుకోగా, 6/7 పాయింట్లతో శర్వాణి రన్నర్ ట్రోఫీని అందుకున్నారు. కృష్ణా రీజియన్ అంతర జిల్లాల చదరంగం పోటీలు విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగాయి. ఏడు రౌండ్ల పాటు జరిగిన పోటీల్లో 179 మంది క్రీడాకారులు పాల్గొన్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ తెలిపారు. ఓపెన్ విభాగంలో ప్రీతందర్శన్, హర్షవర్ధన్, అభిరామ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించారు. అండర్–7 బాలుర విభాగంలో సుహిరిత్, రేయాన్స్, అద్వైత్, బాలికల విభాగంలో మరియమ్‌ఖాన్, నిధిదారశ్రీ, అక్షర, అండర్–9 బాలుర విభాగంలో సాత్విక్‌రెడ్డి, సురాజిత్, ప్రభంజనం నాయుడు, బాలికల విభాగంలో మోక్షిత, హర్షిత, దివిష, అండర్–11 బాలుర విభాగంలో హర్షిత్, కార్తీక్, భరత్‌రెడ్డి, బాలికల విభాగంలో గీతిక, రూపశ్రీ, యశస్వి, అండర్–13 బాలుర విభాగంలో త్రిలోక్, చిరాగ్, మహిధర్, బాలికల విభాగంలో జయఅహల్య, సాత్విక, వర్షిత, అండర్–15 బాలుర విభాగంలో కృష్ణచైతన్య, సాయిశ్రీకర్, అనీష్, బాలికల విభాగంలో సోనాలి, తన్మయి, అక్షర వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు స్కూల్ సీఈవో కె.జాహ్నవి, ఎస్‌ఆర్‌ఆర్ చెస్ కోచింగ్ అకాడమి అధ్యక్షురాలు జె.సౌజన్య, ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ పి.రేణుక ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment