డీఆర్‌ఎం విస్తృత తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ఆదివారం ఏడీఆర్ కొండా శ్రీనివాసరావు, బ్రాంచ్ అధికారులతో కలసి కాకినాడ–విజయవాడ సెక్షన్‌లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ముందుగా కాకినాడ పోర్టుకు చేరుకున్న డీఆర్‌ఎం అక్కడ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రన్నింగ్ రూమ్‌లను తనిఖీ చేసి లోకో పైలట్‌లకు అందించే ఆహారం నాణ్యతను, లాండ్రీ సేవలను తనిఖీ చేశారు. అక్కడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించారు. నిరంతరం సౌకర్యాల మెరుగునకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తనిఖీలో విజయవాడ–విశాఖపట్నం ప్రధాన మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) పనుల పురోగతితో పాటు సెక్షన్‌లో భద్రత చర్యలను క్షుణంగా పరిశీలించారు. ప్రయాణికుల భద్రత అంశాలు, ప్రాజెక్ట్‌ల పనులను వేగవంతంగా పూర్తిచేయాల్సిందిగా ఆదేశించారు. సిగ్న లింగ్, మౌలిక సదుపాయాలు, సిబ్బంది శిక్షణ ద్వారా భద్రత వ్యవస్థలను మెరుగు పర్చడంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాల కల్పన దిశగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. డివిజన్‌లో అన్ని విభాగాల్లో భద్రత, రైళ్ల నిర్వహణను సమర్థంగా నిర్వహిస్తున్న సిబ్బందిని డీఆర్‌ఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment