నిర్లక్ష్యం చేస్తే నష్టం అధికం..
పల్లాకు తెగులు విషయంలో నిర్లక్ష్యం సరికాదని ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణి తెలిపారు. నష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. సుమారుగా 40 శాతంపైగా ప్రభావం ఉండవచ్చని చెప్పారు.
ఇలా చేయాలి..
● పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన ఎల్‌బీజీ 932, 904, 884, 752, టీబీజీ 104, ఎల్‌బీజీ 787, పీయూ 31 రకాలను ఎంచుకోవాలి.
● రసం పీల్చే పురుగు నుంచి రక్షణ కోసం ఽ5 గ్రాములు దయోమిథాక్సమ్ 70 డబ్ల్యూస్, లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లప్రిడ 600 ఎఫ్‌ఎస్ మందుతో విత్తనశుద్ధి చేయటం మంచిది.
● పొలం చుట్టూ రక్షక పంటగా జొన్న, మొక్క జొన్న, నాలుగు వరుసల్లో విత్తుకోవటం ద్వారా వైరస తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులను ఒక పొలం నుంచి మరో పొలంలోకి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు.
● పల్లాకు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
● పొలంలో అక్కడక్కడా 20 గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలు పైరుకు ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి.
● తెల్లదోమ పంటను ఆశించకుండా విత్తిన 20–25 రోజుల్లో వికర్షకాలుగా పనిచేసే 5 మిల్లీలీటర్లు వేపనూనె ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ఉద్ధృతి అధికంగా ఉంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment