బాలిక మెడలో నగలు చోరీ.. నిందితురాలు అరెస్ట్
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఆడుకుంటున్న బాలిక మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేసిన నిందితురాలిని ఎస్‌ఎన్‌పురం పోలీసులు అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరానికి చెందిన షేక్ జంషీర కుటుంబ సభ్యులతో కలసి నివాసముంటోంది. జనవరి 26న తన మనవడు పుట్టెంట్రుకల వేడుకలను సత్యనారాయణపురంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్‌లో నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆరేళ్ల వయస్సు ఉన్న తన మనమరాలు ఫంక్షన్‌లో ఆడుకుంటుండగా గుర్తు తెలియని బురకా ధరించిన మహిళా బాలిక వద్దకు వెళ్లి మీ అమ్మ తీసుకురమ్మంది అని చెప్పి బాలిక మెడలోని బంగారు నెక్లెస్, పాపిడి బిళ్ల తీసుకుని అక్కడ నుంచి పరారైంది. జరిగిన విషయం బాలిక తన తల్లికి తెలుపడంతో.. ఆ మహిళ కోసం చుట్టుపక్కల వెతికారు. అయినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో అదే రోజు ఎస్‌ఎన్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అందుబాటులోని సీసీ కెమెరాల ద్వారా చోరీకి పాల్పడింది. నగరంలోని వాంబే కాలనీకి చెందిన షేక్ నాగుర్‌బీగా గుర్తించి ఆదివారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment