![భావిభారత నిర్మాణానికి దివ్య ఖురాన్ మార్గదర్శి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09vie71-310168_mr-1739129150-0.jpg.webp?itok=eCm504-H)
భావిభారత నిర్మాణానికి దివ్య ఖురాన్ మార్గదర్శి
ఆటోనగర్(విజయవాడతూర్పు): నైతిక విలువలతో కూడిన భావిభారత నిర్మాణానికి దివ్య ఖురాన్ మార్గదర్శి అని ఏటీఏ అధ్యక్షుడు రాజనాల వెంకట రమణారావు అన్నారు. ఏటీఏ హాలులో ఆదివారం 10వ రాష్ట్రస్థాయి ఖురాన్ కంఠస్థ ఫైనల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మౌలానా ముహమ్మద్ అమీన్ ఉమ్రి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన యునైటెడ్ ఫోరం ఫర్ క్యూర్ అనిక్ స్టడీస్ (యుఎఫ్‌ఎస్‌క్యూఎస్) చైర్మన్ దావూద్ సాహెబ్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల నుంచి చిన్నపిల్లలకు ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11వేల దరఖాస్తులు రాగా దాదాపు 9వేల మంది మొదటి రౌండ్‌కు ఎంపికయ్యారన్నారు. వారిలో 44 మంది ఫైనల్‌కు చేరారన్నారు. కార్యక్రమంలో సయ్యద్ సాహెబ్ హుస్సేన్ (బాబా) హమిబుల్లాఖాన్, పి.అహ్మద్, హుస్సేన్, అడ్వకేట్ మతీన్, పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
ఏటీఏ అధ్యక్షుడు రాజనాల
ఘనంగా ముగిసిన
ఖురాన్ కంఠస్థ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment