గుట్కా విక్రయ దుకాణాలపై దాడులు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌లో ఉన్న వివిధ దుకాణాల్లో నిషేధిత గుట్కా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న సమాచారంపై ఎకై ్సజ్, పోలీసు, ఫుడ్ శాఖ అధికారులు మంగళ, బుధవారాల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. పలు దుకాణాల్లో గుట్కా విక్రయాలు చేస్తున్నారని గుర్తించిన అధికారులు, వారిపై జరిమానాలు విధించారు. ఇకపై ఇటువంటి నిషేధిత వస్తువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి స్వాధీనం
రాయగడ: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను పద్మపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 26 కిలోల గంజాయితో పాటు 4 సెల్‌ఫోన్లు, రూ.1,880 నగదును స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టుకు తరలించారు. మంగళవారం సాయంత్రం ఎప్పటిలాగే పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు బైకులను ఆపి, వెనుకనున్న బస్తాలను తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసి బైకులను సీజ్ చేశారు.
పిడుగులు పడి పశువులు మృతి
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి చంద్రపడ గ్రామ పంచాయతీ పిపల్‌గుడ గ్రామ అడవిలో గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలును పశువుల కాపరి మేతకు తీసుకెళ్లాడు. అవి మేత మేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగులు పడ్డాయి. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 2 ఎద్దులు, 13 గొర్రెలు సంఘటన స్థలం వద్దనే మరణించగా, మరో 10 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు సంఘటన ప్రాంతానికి చేరుకొని గాయపడిన గొర్రెలను తీసుకెళ్లారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మోదీ హయాంలో
రైతులకు మేలు
రాయగడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో దేశంలోని రైతులకు మేలు జరిగిందని బీజేపీ కృషక్ మోర్చ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేశ్వర్ సాహు అన్నారు. జిల్లాలోని గుణుపూర్‌లో మంగళవారం సాయంత్రం పర్యటించిన ఆయన కృషక్ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. కృషక్ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సస్మిత మహాంతి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉందని పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం మద్దతు ధరను రూ.3,100 పెంచారని గుర్తు చేశారు. ఇటువంటి రైతు సంక్షేమ పనులు మరెన్నో రానున్న రోజుల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కృషక్ మెర్చా జిల్లా అధ్యక్షుడు కృష్ణచంద్ర పండ, సభ్యులు సుమంత్ కుమార్ మహారాణ, రజత్ కుమార్ మదల, రాజేశ్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment