తాపీ పట్టిన ఎంపీ బలభద్ర మజ్జి
కొరాపుట్: బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ పార్లమెంట్ సభ్యుడు బలభద్ర మజ్జి తాపీపట్టి మేసీ్త్ర పని చేశారు. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి 11వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధానమంత్రి అవాస్ యెజన పధకం లబ్ధిదారులైన సబితా గొండో, మహేష్ గొండోలు తమ ఇల్లు తామే నిర్మించుకుంటున్నారు. ఇది చూసిన ఎంపీ తాను కూడా వారితో జత కలిశారు. ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సురభి శిశు మహోత్సవం
జయపురం: కుంద్ర సమితి కెరమెట గ్రామ ఉన్నత పాఠశాలలో బుధవారం సరభి శిశు మహోత్సవం నిర్వహించారు. కుంద్ర సమితి బీడీవో ప్రకాశ కర్తామీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేపట్టిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గౌరవ అతిథిగా కొరాపుట్ జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు త్రినాథ్ హరిజన్, బ్లాక్ అదనపు విద్యాధికారి పొపెయి బెహర, సమితి సంఘ అధ్యక్షుడు త్రినాథ్ పండ, సర్పంచ్ మాణిక్ శాంత, సీఆర్‌సీసీ ప్రమోద్ బారిక్, కెరామటి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పవిత్ర భొయి తదితరులు పాల్గొన్నారు.
కొరాపుట్ బంద్‌కు మద్దతు
జయపురం: జిల్లాస్థాయి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4వ తేదీన అవిభక్త కొరాపుట్ జిల్లా 12 గంటల బంద్ పిలుపునకు తమ పూర్తి మ ద్దతు ఉంటుందని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ దళిత వర్గాల మ హాసంఘ మహిళా విభాగ అధ్యక్షురాలు మనస్వినీ టక్రి వెల్లడించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆమె మాట్లాడారు. ప్రభు త్వం బహుళ ఆదివాసీ కొరాపుట్ జిల్లాపై చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment