గోడు ఆలకించేదెవరు..?
● రాష్ట్రంలో మొరాయిస్తున్న పాక్షిక
న్యాయ వ్యవస్థ
● పలు సంస్థల్లో అధ్యక్ష పదవులు ఖాళీ
భువనేశ్వర్:
రాష్ట్రంలో పాక్షిక న్యాయ వ్యవస్థ మొరాయిస్తోంది. పీడిత, బాధిత వర్గాలకు సత్వర న్యాయం కల్పించేందుకు ఏర్పాటైన ఈ సంస్థలో కీలకమైన అధికారులు, సభ్యుల నియామకం లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత ఉదాసీనతతో లోకాయుక్త, ఎన్నికల కమిషను, సమాచార హక్కు కమిషను, మహిళా కమిషను, ఒడిశా మానవ హక్కుల కమిషను (ఓహెచ్‌ఆర్‌సి), ఒడిశా విద్యుత్ నియంత్రణ కమిషను (ఓఈఆర్‌సి) వంటి ప్రముఖ పాక్షిక న్యాయ వ్యవస్థల్లో అధ్యక్షుడు, అనుబంధ సభ్యుల పదవులు ఖాళీగా పడి ఉన్నాయి. పదవీ కాలం పూర్తయ్యి ఆయా అధికారులు వైదొలగిన తర్వాత నియామకం జరగడం లేదు. దీంతో పీడిత సామాన్య ప్రజానీకం చట్టపరమైన సత్వర న్యాయం లబ్ధికి దూరం అవుతున్నారు.
వృథా ఖర్చులు
దీర్ఘకాలం తర్వాత ఒడిశా మానవ హక్కుల కమిషను అధ్యక్ష పదవి భర్తీ చేసి అనుబంధ సభ్యుల నియామకం విస్మరించారు. అరకొర నియామకంతో న్యాయ విచారణకు వీలు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. సాధారణ ప్రజానీకం సత్వర న్యాయం పొందలేకపోతున్న తరుణంలో ఆయా సంస్థల ఉన్నత పదవుల్లో అధికారులు, సిబ్బంది జీతభత్యాల కోసం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment