కొత్త అతిథులు | - | Sakshi
Sakshi News home page

కొత్త అతిథులు

Published Thu, Nov 28 2024 12:57 AM | Last Updated on Thu, Nov 28 2024 12:57 AM

కొత్త

కొత్త అతిథులు

భువనేశ్వర్‌: నగర శివారులోని చందకా ఏనుగుల అభయారణ్యం గజరాజులకు అత్యంత అనుకూల అటవీ ప్రాంతం. ఈ ప్రాంతానికి కొత్తగా 2 గున్న ఏనుగులు అతిథులుగా విచ్చేశాయి. కుమారఖుంటి అటవీ ప్రాంతంలో వీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త అతిథులకు రాథిక, గగ్గు అని నామకరణం చేశారు. రాధిక వయసు 4 నెలలు కాగా, గగ్గు వయసు 3 నెలలు. ఈ రెండు గున్న ఏనుగులు ప్రధాన గుంపు నుంచి దారి తప్పి అల్లాడుతున్నట్లు గుర్తించిన అభయారణ్యం అధికారులు అక్కున చేర్చుకుని అభయాశ్రయం కల్పించారు.

కొడుకుపై దాడి చేసిన

తండ్రి అరెస్టు

జయపురం: కొడుకు, తండ్రి మధ్య జరిగిన గొడవలో భాగంగా కొడుకుపై గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన తండ్రిని అరెస్టు చేసినట్లు జయపురం సదర్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌చార్జి, పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్‌ దొళాయి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. జయపురం సమితి ధరణహండి గ్రామంలో మానసింగ్‌ గోండ్‌, అతడి కుమారుడు పరశురాం గోండ్‌లు వేర్వేరుగా నివసిస్తున్నారు. అయితే ఈనెల 19వ తేదీన ఏదో కారణం వలన వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మాన్‌సింగ్‌ కోపంతో గొడ్డలితో కుమారుడు పరశురాంపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరుశురాంను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బంధువులు చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్‌ సాహిద్‌ లక్ష్మణ్‌ నాయిక్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు పరశురాం 21వ తేదీన గగణాపూర్‌ పోలీసు పంటిలో ఫిర్యాదు చేశాడు. గగణాపూర్‌ పోలీసు పంటి అధికారి రాజకిశోర్‌ బారిక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుని మంగళవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

జయపురం బంద్‌కు నిర్ణయం

జయపురం: జగన్నాథ్‌ సాగర్‌ పునరుద్ధరణ చేపట్టాలనే డిమాండ్‌తో జయపురం బంద్‌ చేపట్టాలని మో జగన్నాథ్‌ ట్రస్టు నిర్ణయించింది. ఈ మేరకు ట్రస్ట్‌ సభ్యులు బుధవారం సమావేశమై సాగర్‌ పునరుద్ధరణ పనుల తీరు తెన్నులపై చర్చించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు జగన్నాథ్‌ సాగర్‌ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని మున్సిపాలిటీకి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మీడియాకు తెలిపారు. అందువలన జయపురంలో 12 గంటల బంద్‌ జరపాలని నిర్ణయించామని, అయితే ఎప్పుడు బంద్‌ జరపాలన్నది అందరితో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు. సమావేశంలో ట్రస్టు అధ్యక్షుడు రజనీ కాంత నాయిక్‌, మున్న పాణిగ్రాహి, రఘునాథ్‌ త్రిపాఠీ, నిరంజన్‌ పాణిగ్రహి, బి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కుప్పలు దగ్ధం

రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఉన్న ఇండియన్‌ గ్యాస్‌ గోడౌన్‌ వెనుక ఒక పొలంలో ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు విలువ చేసే ధాన్యం కుప్పలు తగలబడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
కొత్త అతిథులు 1
1/2

కొత్త అతిథులు

కొత్త అతిథులు 2
2/2

కొత్త అతిథులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement