గంజాయి పంట ధ్వంసం
జయపురం: బొయిపరిగుడ సమితి జి.మజిగుడ పంచాయతీ రంగిణిగుడ, తొలటికిరిపడ పరిసర ప్రాంతాల్లోని 51 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసు వర్గాలు బుధవారం వెల్లడించాయి. పోలీసులు, ఎకై ్సజ్ విభాగం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 50,600 మొక్కలను దగ్ధం చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, ప్రొబిషన్ ఐపీఎస్ అధికారి ఏఎస్ఎం రెడ్డి, నందపూర్ ఎకై ్సజ్ విభాగ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్, పొట్టంగి ఐఐసీ నీలమణి లెహజ, బొయిపరిగుడ ఎకై ్సజ్ ఐఐసీ భగవాన్ మహానందియ, బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజలి ప్రధాన్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ బెహర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment