రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీల భేటీ
కొరాపుట్: కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్ణవ్‌తో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కలహండి ఎంపీ మాళవికా దేవిలు బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రైల్వేమంత్రి చాంబర్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయపూర్–నబరంగ్‌పూర్, జయపూర్–మల్కన్గిరిల మధ్య జరగనున్న రైల్వే నిర్మాణం కోసం జరగుతున్న భూ సేకరణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారాలు పెంచాలనన్నారు. అదేవిధంగా భద్రాచలం–మల్కన్‌గిరి, నబరంగ్‌పూర్–జునాఘడ్‌ల మధ్య ప్రభుత్వం నిర్మించాల్సిన నూతన రైలు మార్గం పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ నిర్మాణాల వలన కూడా భూ పరిహరాలు పెంచాలని ఎంపీలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు తెచ్చిన నివేదికని రైల్వేమంత్రి పరిశీలించి వాటికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment