పదాల తొలగింపు అవమానకరం: బీజేడీ
భువనేశ్వర్: జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర శాసన సభలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన భారత రాజ్యాంగం ఉపోద్ఘాత పత్రంలో సెక్యులర్, సోషలిస్టు రెండు పదాలు వైదొలగించడంపై విపక్ష బిజూ జనతా దళ్ తీవ్రంగా విరుచుకు పడింది. శాసన సభ శీతా కాలం సమావేశాల్లో విపక్ష హోదాలో బిజూ జనతా దళ్ సభ్యులు ఎవరి స్థానంలో వారు నిలబడి శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. అఠొగొడొ నియోజక వర్గం ఎమ్మెల్యే రణేంద్ర ప్రతాప్ స్వంయి ఈ నిరసనకు సారథ్యం వహించారు. భారత రాజ్యాంగం ఉపోద్ఘాతం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాల్ని తొలగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మర్నాడే రాష్ట్ర శాసన సభలో ప్రదర్శించిన రాజ్యాంగం ఉపోద్ఘాత పత్రంలో ఈ రెండు పదాలు కనుమరుగు కావడం అత్యంత విచారకరమని రణేంద్ర ప్రతాప్ స్వంయి ఆక్షేపించారు. ఈ నిరసనకు కాంగ్రెసు సభ్యులు కూడ మద్దతు ప్రకటించి బీజేడీ సభ్యుల తరహాలో ఎవరి స్థానంలో వారు నిలబడి నిరసన ప్రదర్శించారు.
జాతీయ పోటీల్లో పవన్‌సాయి ప్రతిభ
రణస్థలం: జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ క్రీడా పోటీల్లో రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన మామిడి పవన్‌సాయి సత్తాచాటాడు. ఈ నెల 19 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పోటీల్లో 70–75 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు, గతంలో రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా పవన్‌సాయిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు మంగళవారం అభినందించారు.
విధులకు ఆటంక పరిచాడంటూ ఎస్‌ఐ ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : విధుల్లో ఉన్న తనను ఆటంకపర్చాడంటూ సాయంకాల పత్రికా విలేకరి పవన్‌పై శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ–2 రామారావు అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరికృష్ణ మంగళవారం తెలిపారు. ఈ నెల 24వ తేదీ రాత్రి దమ్మలవీధికి చెందిన వ్యక్తితో వాగ్వాదం, దాడి జరుగుతుండగా సిబ్బందితో వెళ్లిన తనను పవన్ అడ్డుపడి విధులకు తీవ్రంగా ఆటంకపర్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా, ఇల్లు నిర్మించుకునేటప్పుడు డబ్బులు డిమాండ్ చేశారనే కారణంతో ఇప్పటికే పవన్‌పై ఓ దళిత మహిళ (రేజేటి శిరీష) ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment