‘స్మార్ట్ మీటర్లతో దోచుకుంటున్నారు’
రాయగడ: స్మార్ట్ మీటర్ల పేరిట విద్యుత్ వినియోగదారులను టీపీఎస్ ఓడీఎల్ ప్రైవేట్ సంస్థ నిలువునా దోచుకుంటోందని అమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పేరిట ఒక వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయానికి ఆ పార్టీ నాయకుడు జన్మాజయ్ స్వాయి అందజేశారు. రాష్ట్రంలో ఈ సంస్థ గుత్తాధిపత్యం తీసుకున్న తర్వాత స్మార్ట్ మీటర్ల పేరిట అధిక విద్యుత్ ఛార్జీలను వసూళ్లు చేస్తోందని, దీనిని నివారించాలని డిమాండ్ చేశారు.
ముందుగా డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్నారని, అందువలన నెలకు కనీసం మూడు వందల యూనిట్లను ఉచితంగా అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment